Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభంప్రారంభోత్సవానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర రావు, అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు.
Share the news
Janasena party office opening: రేపల్లెలో ఈ నెల 18న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం!

Janasena party office opening

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయం ఈ నెల 18 ఆదివారం న ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాని(Janasena party office opening) కి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్(Anagani) ముఖ్య అతిధులుగా పాల్గొంటారని చెప్పారు.

Janasena Party Office Opening

కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా పట్టణంలో వివిధ వార్డుల్లో జనసేన పార్టీ జెండాల ఆవిష్కరణ, ర్యాలీలు, భారీ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ కార్యాలయ గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసేన-టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

See also  Another Shock to YS Jagan? జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబుతుందా??
Janasena Party Office Opening

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top