Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి..

Share the news
Janasena Sweet Warning to TDP: మీరు రెండు ప్రకటిస్తే..మేమూ రెండు ప్రకటిస్తాం.. ఒత్తిడి తట్టుకోవడానికి..

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. దీనిపైన పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) అభ్యంతరం వ్యక్తం చేశారు. మండపేట నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. చాలా బాధపడ్డారు. గత ఎన్నికల్లో 18 శాతం ఓటింగ్ ఉంది. అది ఇవాళ చాలా బలమైనదిగా ఉంది. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.. కానీ వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు. అందుకు మా పార్టీ నేతలకు తాను క్షమాపణలు చెప్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లు అనౌన్స్ చేయడంతో తాము కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

2 సీట్లు ప్రకటించి.. Janasena Sweet Warning ఇచ్చిందా?

చంద్రబాబుకు ఉన్నట్లే.. తనకూ పార్టీలో ఒత్తిడి ఉందన్నారు. తాను కూడా ఒత్తిడి తట్టుకోవడానికి సీట్లు సీట్లు ప్రకటించాల్సి వస్తుందని వాళ్ళు ప్రత్యేక పరిస్తుతుల్లో 2 సీట్లు ప్రకటించారు కాబట్టి, నేను కూడా వత్తిడి తట్టుకోవాలి కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బావుందనిపించింది RRR లాగా. అందుకని రాజోలు, రాజానగరం సీట్ల లో పోటీ చేస్తాం అని అన్నారు జనసేనాని. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని.. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామన్నారు. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నామన్నారు.

See also  AP Inter Results 2024: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడి.. రిజల్ట్స్ చూసుకోండి ఇలా!

పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదని… కానీ ఒంటరిగాపోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయో లేదో తెలియదు అన్నారు. వాస్తవాలు తెలియవని చాలా మంది విమర్శిస్తుంటారని అవి తెలియకుండా రాజకీయాల్లోకి ఎలా వచ్చానని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని.. విడదీయం చాలా తేలికన్నారు. అందుకే తనకు ఎప్పుడూ కలపడమే ఇష్టమని పేర్కొన్నారు.

లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని.. సీనియర్ నేతగా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. పొత్తులు సీట్లు సర్దుబాటు అంటే వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్టు ఉంటుందని ఉదహరించారు. అందుకే అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.. జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు.. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు జనసేనాని.

పొత్తు ధర్మం గురించి పవన్ సుతిమెత్తగా మాటాడుతూ సీట్లు ప్రకటించడం, అది టీడీపీకి ఒక హెచ్చరిక పంపినట్లుందని రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. అలా అని ఇప్పటికిప్పుడు పొత్తు చెడుతుందని కాదు, కానీ టీడీపీ ఇక పై జాగ్రత్త పడుతుంది.. పడాలి కూడా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top