Drainage Works: డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి, ఆందోళన!

డ్రెయిన్ నిండా తూటి కాడ ప్లాస్టిక్ వ్యర్ధాలు. కదలని మురుగుతో, కాలనీ వాసుల ఇక్కట్లు. డ్రెయిన్ పూడిక తీత(Drainage Works) పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి ఆందోళన
Share the news
Drainage Works: డ్రెయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని జనసేన, టిడిపి బిజెపి, ఆందోళన!

Drainage Works చేపట్టాలని జనసేన, టిడిపి, బిజెపి ఆందోళన!

బాపట్ల జిల్లా రేపల్లె(Repalle) : డ్రైనేజీ నిండా దట్టంగా పెరిగిన తూటి కాడ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, పారుదలలేని మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతూ దోమలకు ఆవాసాలుగా డ్రైన్. బడుగు బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా నివసించే నేతాజీ నగర్ లో ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. పాలక పార్టీ నాయకులు అధికారం చేపట్టిన నాటి నడి నేటి వరకు డ్రైనేజీలను పట్టించుకున్న పాపాన పోలేదు. నేతాజీ నగర్ లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసిన జనసేన(Janasena), టిడిపి(TDP), బిజెపి(BJP) నాయకులు డ్రైనేజీ లో పూడికతీత(Drainage Works) పనులు చేపట్టాలని మంగళవారం ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్(Rasamsetti Mahesh) మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ఏ ఒక్క డ్రైన్ లోను తూటి కాడ, వ్యర్ధాలు తొలగింపు చేయలేదని విమర్శించారు. అభివృద్ధిని మరచిన వైసీపీ(YCP) నాయకులు దోచుకోవటం దాచుకోవడంతో కాలయాపన చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కాలనీని అభివృద్ధి చేసిన ఘనత అనగానిదే అన్నారు. డ్రైనేజీలలో పూడిక తీత(Drainage Works) పనులు చేపట్టి మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుత పాలకులు డ్రైనేజీలను నిర్లక్ష్యంగా వదిలేశారని, అవన్నీ పూడుకుపోయి ప్లాస్టిక్ వ్యర్ధాలతో పారుదల లేక మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్న పట్టించుకున్న వారు లేరన్నారు ఆరోపించారు. డ్రైనేజీ వెంట రక్షణ గోడలు లేకపోవడం, విద్యుత్తు లైట్లు లేకపోవడం చేత నిత్యము ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది డ్రైన్ లో పడిపోవటం జరుగుతుందని కాలనీవాసులు వాపోతున్నారని చెప్పారు.

See also  Criminal Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం!

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనగాని తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో పరుగు పెట్టించిన ఘనత అనగానిదే అన్నారు. నేతాజీ నగర్ అభివృద్ధి కొరకు అనగానిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పట్టాభి రామారావు, రాజేష్, కోటి ,కళ్యాణ్, సాయి, రవి, కొండ తదితరులు పాల్గొన్నారు

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top