
Janasenani Victory celebrations..
జనసేనాని(Janasenani) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో మెగా కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గెలుపు అనంతరం తొలిసారి పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన కుమారుడు అకిరా నందన్, భార్య అన్నా లెజ్నెవాతో సహా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్‌కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది.
ఇక గెలుపుతో వచ్చిన కుమారుడికి అంజనమ్మ గుమ్మడికాయతో దిష్టి తిసింది. వదిన సురేఖ హారతి ఇచ్చి మరిదిని ఆహ్వానించింది. అనంతరం భావోద్వేగంతో తల్లిని అప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు పవర్ స్టార్. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య కాళ్లకు నమస్కారించి.. ఆ తర్వాత తల్లి అంజనమ్మ, వదిన సురేఖ కాళ్లకు కూడా నమస్కరించిన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం భావోద్వేగ వీడియో మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోలో అన్నయ్య చిరంజీవిని చూడగానే పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తమ్ముడి హత్తుకుని చిరంజీవి ముద్దు పెట్టిన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. అనంతరం తమ్ముడిని భారీ పూల మాలతో సత్కిరించారు చిరంజీవి. మొత్తం ఎమోషనల్‌గా సాగిన ఈ ఘట్టం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ వెన్నంటే ఉన్నారు.
An emotionally charged welcome to my dear brother A Real life ‘Power Star’!!
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 6, 2024
A Hero’s Homecoming ! 💐
God bless!! 🙏 @PawanKalyan pic.twitter.com/B9zgQPQyP5