
Kamalapuram Meeting లో ప్రభం’జనం’!
ఈ రోజు కడప నడి బొడ్డు కమలాపురం లో జరుగుతున్న ‘రా.. కదలిరా..’ సభకు జనం ప్రభంజనంలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎన్టీఆర్ స్టయిల్లో చెప్పాలి అంటే నేల ఈనిందా అని అనాలి. కడప రాజకీయాలకు కమలాపురం రాజకీయ సూచీ. అలాంటి కమలాపురం లో జరిగిన సభాప్రాంగణం కి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ జనం దేనికి సూచన. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం పెద్ద ఎత్తున బీసీ కులాల హాజరైనట్లు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తు కూడా బాగా పని చేసినట్లుగా వుంది. జనసేన పార్టీ అభిమానులైన బలిజ, ఒంటరి మరియు తెలగ కులాలకు సంబందించిన వారు కూడా పెద్ద ఎత్తున హాజరవడమే దానికి రుజువు. ఆశ్చర్యంగా రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా ప్రజలు బాగానే వచ్చారు.
ఇంకో పక్క రాయల సీమ తాగు నీటి, సాగు నీటి సమస్య తీరక పోవడంతో జనం లో వైసీపీ(YCP) పైన వున్న వ్యతిరేకత కూడా ఈ ప్రభంజనానికి మరొక కారణం అంటున్నారు విశ్లేషకులు. పైన చెప్పిన వర్గాల వారితో పాటు నూట్రాల్స్ కూడా పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చినట్లు తెలుస్తోందని విశ్లేషకుల భావన.
ఏది ఏమైనా Kamalapuram Meeting సక్సెస్ అవ్వడం.. రాయలసీమ రాజకీయ మార్పును కోరుకుంటుందని clear గా అర్ధం అవుతుంది.