
AP Elections 2024 Schedule
కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు, 7 విడతల్లో పోలింగ్ – వెల్లడించిన ఈసీ. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ వివరించారు. దేశంలో ఎన్నికలకు సంబంధించి.. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు ఉన్నాయని చెప్పారు.
దేశ పౌరులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజీవ్ కుమార్ కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిని ఎన్నికల నామసంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రపంచమంతా భారత్‌లోని ఎన్నికల వైపునకు చూస్తోందని అన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist