
జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ అభ్యర్థిగా Mandali Buddha Prasad?
టీడీపీ(TDP) నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్(Mandali Buddha Prasad) టీడీపీకి రాజీనామా చేసి జనసేన(Janasena) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అవనిగడ్డ(Avanigadda) పోటీ చేస్తారని తెలుస్తుంది. నిజానికి ఆయన టీడీపీ తరుపున అవనిగడ్డ నుంచి పోటీ చేయవలసి వుంది, కానీ పొత్తులో భాగంగా ఆ సీట్ జనసేనకు కేటాయించడంవల్ల టీడీపీ ఆయనుకు టికెట్ ఇవ్వలేక పోయింది. కానీ ఇప్పుడు అయన టీడీపీకి రాజీనామా చేసి జనసేన తరుపున అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది
ఇక ఆయన అభిమానులుకూడా కొద్దీ రోజుల నుంచి జనసేన నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను కలసి అధికారికంగా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. కూటమి అభ్యర్థిగా ఆయన పేరును జనసేన తరపున దాదాపుగా ఖరారు చేస్తారని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ ఓ అంచనాకు రాలేక పోయింది. ఈ క్రమంలో అవనిగడ్డ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా చివరికి మండలివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మండలి బుద్ధప్రసాద్ 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలడంతో.. ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్‌కు జనసేన టికెట్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే మండలి బుద్ధ ప్రసాద్ ఎంపికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.