Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్..

Share the news
Master Plan for Christian Votes: క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్..

Master Plan for Christian Votes

Christian Votes క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్(Jagan Mohan Reddy) మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. ఈరోజు తాడేపల్లిలో పాస్టర్లతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టాలని.. ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయాలని ఆదేశించారు.

దీంతో ఆమెను బ్రదర్ అనిల్ కుమార్ స్థానంలో రంగంలోకి దించినట్టేనని తేలిపోయింది.

బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిల(YS Sharmila) కాంగ్రెస్(Congress ) పగ్గాలు తీసుకున్న తరుణంలో.. క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. దీనికి విరుగుడుగా క్రిస్టియన్ ఓటు వైసీపీ(YCP) నుంచి జారకుండా తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.

విమలారెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ దూకుడుకు ఆమె అడ్డుకట్ట వేయగలరా? లేదా? అన్నది చూడాలి.

See also  Pawan Kalyan on Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top