Migrations to TDP: రేపల్లె నియోజకవర్గంలో వైసీపి నుంచి టిడిపి లోకి పెరిగిన వలసలు..

Share the news
Migrations to TDP: రేపల్లె నియోజకవర్గంలో వైసీపి నుంచి టిడిపి లోకి పెరిగిన వలసలు..

Migrations to TDP

రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో వైసిపి పార్టీని వీడి టిడిపి లోకి వలసలు(Migrations to TDP) వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపికి మద్దతు తెలుపుతూ పలువురు పార్టీలోనికి రావటం శుభ పరిణామం అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

బుధవారం నిజాంపట్నం మండలం బొర్రవారి పాలెం, అచ్యుతపురం, ప్రజ్ఞం గ్రామాల నుంచి పలువురు వైసీపీకి చెందిన నాయకులు టిడిపిలోనికి చేరారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు నలభై కుటుంబాలకు చెందిన పలువురు పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన యువత పెద్ద ఎత్తున పార్టీలోనికి రావడం శుభ సూచకమన్నరు. వైసిపి పాలకులు అభివృద్ధిని మరిచి, అవినీతి అరాచక పాలన సాగించారని విమర్శించారు. రాష్ట్రంలో సైకో పాలనను తరిమికొట్టేందుకు టిడిపి, జనసేన సంయుక్తంగా వైసీపితో పోరాడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

See also  MP Mopidevi: ప్యాకేజీలు… ప్రలోభాలు… టిడిపి నైజం అంటూ టిడిపి పై ధ్వజమెత్తిన ఎంపీ మోపిదేవి!

అనంతరం పార్టీలో చేరిన బొర్రా వెంకటేశ్వరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా గోవర్ధనప్రసాద్, మోర్ల వెంకటరావు, బొర్రా వెంకటేశ్వరరావు, సమ్మెట వెంకటేశ్వరావు, బొర్రా ముసలయ్య, వి.లక్ష్మనరావు, వి.నాయుడు, వి.వీరాజు, నాయుడు ప్రసాద్, కే.వెంకటేశ్వరావు, నరేంద్ర, రాజేష్, సంతోష్, రవీంద్ర, వెంకటేశ్వరరావు, .అంకమ్మరావు, అంకయ్య, అంకరాజు, .శ్రీను, మురహరిరావు, శ్రీను, రామారావులకు కండువా కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంతాని మురళీధరరావు, గూడపాటి శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాతా ఏడుకొండలు, నియోజకవర్గ పొలిటికల్ మేనేజర్ పుషాడపు కుమారస్వామి, జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, బొర్రావారిపాలెం ఎంపీటీసీ బొర్రా సురేంద్ర, బొర్రా సాంబయ్య, మట్టా శ్రీనివాసరావు, కేసన మధుసూదనరావు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top