Ramzan: రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే అనగాని

రంజాన్(Ramzan) సందర్బంగా ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గున్న ఎమ్మెల్యే అనగాని. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Share the news
Ramzan: రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే అనగాని

ముస్లిం సోదరులకు Ramzan శుభాకాంక్షలు తెలిపిన అనగాని

రేపల్లె(Repalle) :ఆత్మీయుల ఆధ్యాత్మిక చింతనకు ఇఫ్తార్ విందు దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్(Anagani Satya Prasad) అన్నారు. నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం కనగాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరిస్తూ ఇఫ్తార్ విందు భోజనాలు వడ్డించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనే రంజాన్(Ramzan) అన్నారు. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం పవిత్ర ఆరాధనలకు, ధార్మిక చింతనకూ, దైవభక్తికీ, క్రమశిక్షణకూ, దాతృత్వానికి ఆలవాలం అవుతుందన్నారు. ఈ మేరకు ముస్లిం సోదరులకు రంజాన్(Ramzan) శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని మాట్లాడుతూ తెలుగుదేశం(TDP) ప్రభుత్వంలోనే ముస్లింలకు మెరుగైన సంక్షేమ పథకాలను అందజేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దుల్హన్ పథకం నిర్వీర్యమైపోయిందని, హజ్ యాత్రలకు ప్రోత్సాహం కరువైందని వివరించారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సమాజానికి పలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, 45 ఏళ్లకే ముస్లింలకు పెన్షన్, రంజాన్ తోఫా కి మించిన పథకం, వక్ఫ్ బోర్డు ఆస్తులు రీసర్వే, ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం హామీలు నెరవేర్చలేదన్నారు.

See also  Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ.. ఎమ్మెల్యే అనగాని

ఇక రానున్న ఎన్నికల్లో ముస్లింలందరూ ఐకమత్యంతో కూటమి నాయకులను గెలిపించాలని కోరారు. ముస్లిమ్ సమాజాని కి టిడిపి(TDP), జనసేన(Janasena), బిజెపి(BJP) పార్టీలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, పంతాని మురళీధరరావు, నాయకులు తాత ఏడుకొండలు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, యరగళ్ళ ధర్మ తేజ, తదితరులు పాల్గొన్నారు.

Ramzan

Ramzan

Ramzan

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top