Operation Pithapuram: పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యమట.. ఆపరేషన్‌ పిఠాపురం మొదలెట్టేసిన ముద్రగడ!

కోవర్టు ముసుగు తీసేసి, ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ కాపు నేతలను రెచ్చగొట్టి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ని పిఠాపురంలో ఓడించడానికి Operation Pithapuram పని మొదలు పెట్టారంట.
Share the news
Operation Pithapuram: పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యమట.. ఆపరేషన్‌ పిఠాపురం మొదలెట్టేసిన ముద్రగడ!

Operation Pithapuram

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) ను పిఠాపురంలో చిత్తుగా ఓడిస్తానని ప్రకటించిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆపరేషన్‌ పిఠాపురం(Operation Pithapuram) మొదలుపెట్టేశారట. దీనిలో ఆశ్చ్యర్య పోవలసిన విషయమేమి లేదు అసలు ఈయన్ను వైసీపీ లోకి తీసుకుందే, శిఖండి లా పవన్ కళ్యాణ్ పైన ప్రయోగించడానికి. ఇక ఇప్పడు ముద్రగడ తన పాత పరిచయాలను ఉపయోగించుకుని జనసేనాని పవన్‌ కళ్యాణ్ చిత్తుగా ఓడించాలని కాపు నేతలకు సలహా ఇస్తున్నాడట.

కేవలం పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా గోదావరి జిల్లాల్లో చాలామంది కాపు నేతలను ముద్రగడ కాంటాక్ట్ అవుతారట. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్నారు కాబట్టి ముద్రగడకు ఉభయగోదావరి జిల్లాల్లో పరిచయాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. తన కొడుక్కి నామినేటెడ్ పదవికోసం వైసీపీ లో చేరిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమిని ఓడించాలని ముద్రగడ కంకణం కట్టుకున్నారట.

లేఖలు రాసినంత కాలం ఆయన గౌరవం తగ్గలేదు. కానీ ఎప్పుడైతే కండిషన్స్ ఏమి లేకుండా(నిజానికైతే కొడుక్కి నామినేటెడ్ పదవి కోసం) వైసీపీ లో చేరి జగన్ సేవ చేస్తానన్నాడో అప్పుడే ఆయన గ్రాఫ్ కాపు కులంలో అధఃపాతాళానికి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు కాపు కులం పేరుతో కబుర్లు చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి అయితే లేదు కానీ తన కుటుంబ స్వార్థం కోసం పవన్ కు వ్యతిరేకంగా పని చేయక తప్పడంలేదు.

See also  Assistant Professors: AP ప్రభుత్వ వైద్య కళాశాలలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. .

కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన ముద్రగడ పద్మనాభం ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ముద్రగడ ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వంగా గీత పిఠాపురం నుంచి విజయం సాధించారు. 2009 లో కాంగ్రెస్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి గాలిలో గెలవలేని అయన, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ను పిఠాపురంలో ఓడిస్తానంటూ బీరాలు పలికితే ఎవడు నమ్ముతాడు. నిజానికి ముద్రగడకి కూడా నమ్మకం లేదు కానీ కొడుక్కి నామినేటెడ్ పదవి కోసం మరోసారి కాపు కులాన్ని రెచ్చకొడదామని చూస్తున్నాడు. కానీ ఈ సారి అది కుదరదు, ఎందుకంటే కాపుల్లో ఆయన మీద గౌరవం పోయింది కాబట్టి.

కొసమెరుపు: ఒకవేళ వైసీపీ ముద్రగడ లాంటి నాయకుల ద్వారా కాపులను పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రెచ్ఛగొట్టడానికి ట్రై చేస్తే మాత్రం Operation Pithapuram బూమరాంగ్ అయి కాపులంతా(ముఖ్యంగా కాపు యువత) వైసీపీ కి వ్యతిరేకంగా ఏకమవడం గ్యారెంటీ.

Also Read News

Scroll to Top