Nara Lokesh Speech: 20 లక్షల ఉద్యోగాలు.. ప్రతి ఏడాది డీఎస్సీ.. ఇచ్చాపురం శంఖారావం సభలో లోకేష్!

శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులు. ఇచ్ఛాపురం(Ichchapuram) నుంచి శంఖారావం(Shankaravam) చేపట్టడం నాకు గర్వంగా ఉందన్న యువనేత నారా లోకేష్(Nara Lokesh).
Share the news
Nara Lokesh Speech: 20 లక్షల ఉద్యోగాలు.. ప్రతి ఏడాది డీఎస్సీ.. ఇచ్చాపురం శంఖారావం సభలో లోకేష్!

ఇచ్చాపురం శంఖారావం సభ Nara Lokesh Speech

ఇచ్చాపురం శంఖారావం సభలో Nara Lokesh మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట, పౌరుషాలకు, పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా. జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా జగన్ రెడ్డి మార్చారు. గరిమెళ్ల, సర్థార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది.

జగన్ ప్రతిదానికి సిద్ధం, సిద్ధం అంటున్నాడు, దేనికి జగన్ సిద్ధం? జైలుకు వెళ్లడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. జైలుకు పంపడానికి మీరు సిద్ధమా? భూకబ్జాలకు సహకరించడలేదని విశాఖలో ఎమ్మార్వో రామయ్యను అతి కిరాతకంగా పైసిపి నాయకులు చంపేశారు. బాపట్లలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్బీకేల్లో ఎరువులు దొంగతనం చేయడాన్ని ప్రశ్నించిన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారు. విజయనగరం జిల్లాలో పంచాయితీరాజ్ జేఈ రామకృష్ణ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ప్రజలకు అండగా నిలబడటమే రామకృష్ణ చేసిన తప్పు. వైసిపి నాయకుల దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనను వేధించారు.

మోసానికి, వంచనకు, దగాకు ప్యాంట్ వేస్తే అది జగన్ రెడ్డి. 23 వేల డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. టీడీపీ పాలనలో మొత్తం లక్షా 70వేల పోస్ట్ లు భర్తీ చేయడం జరిగింది. వచ్చే టీడీపీ పాలనలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తాం.

See also  TDP Second List: అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు..

సొంత ఛానల్, పేపర్, సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? లక్ష రూపాయల చెప్పులు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగే జగన్ రెడ్డికి పేదవారి సమస్యలు అర్థమవుతాయా? సొంత చెల్లెలికే భద్రత లేకపోతే మనకు ఎలా రక్షణ ఉంటుంది?

కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచడంతో పాటు చెత్త పన్నుతో ప్రజలను హింసిస్తున్నారు. ప్రజలకు ఉమశమనం కల్పించడానికి చంద్రబాబు, పవన్ కలిపి సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.15వేలు ఇస్తాం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఏడాదికి రూ.18వేలు. ఐదేళ్లలో రూ.90వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ రెడ్డి, మూడు రాజధానులు అని విశాఖలో ఒక్క ఇటుకైనా వేశాడా? విశాఖలో ప్రజాధనం లూటీ చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్పితే ఏం చేయలేదు. విశాఖ రైల్వే జోన్ కు కనీసం భూమి కూడా ఇవ్వలేదు. విశాఖ ఉక్కు భూములను కాజేసేందుకు కుట్ర పన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి రైతులను వంచించారు.

See also  Mood of Andhra: ఆంధ్రాలో బాబు TDPకి అడ్వాంటేజ్, మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అంచనా!

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి అనుసంధానానికి కృషిచేశాం. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ సుజల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో చంద్రబాబు వేగంగా స్పందించారన్న Nara Lokesh

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఇచ్చాపురం నియోజకవర్గానికి పీకింది ఏమీ లేదు. కోకోనట్ పార్క్ ఏర్పాటుచేస్తానని మోసం చేశారు. మహేంద్ర తనయ, బహుద నది ఆధునీకరణ పనులు చేపట్టలేదు.

టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పరిశ్రమలను కూడా ఆదుకుంటాం. కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటాం. రెండు నెలలు ఓపికపడితే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభిస్తాం.

టీడీపీకి కార్యకర్తలే బలం. ఎంతోమంది నాయకులను మంత్రులు, ఉపముఖ్యమంత్రులను చేసిన పార్టీ మనది. జగన్ రెడ్డి పాలనలో నాపై 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. అయినా నేను తగ్గేదే లేదు.చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారు. జైలునుంచి వచ్చాక భయం మా బయోడేటాలోనే లేదని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాశాం, అధికారంలోకి వచ్చాక న్యాయ విచారణకు ఆదేశించి నిబంధనలు అతిక్రమించిన వారిని జైలుకు పంపిస్తాం.

See also  Mega Blood Donation Camp: రక్త దానం చెయ్యండి… ప్రాణ దాతలవ్వండి -అనగాని

ప్రజలకు అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపా నాయకులకు ఈ లోకేష్ మూర్ఖుడు. అధికారంలోకి వచ్చాక వైసిపి సైకోలకు వడ్డీతో సహా చెల్లిస్తాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం.శంఖారావం ద్వారా మళ్లీ మనం ప్రతిగడప తొక్కాలి, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రతిఇంటికీ తీసుకెళ్లాలన్న Nara Lokesh.

క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యులకు కిట్లు ఇస్తున్నాం. ఇందులో ఉన్న క్యాలెండర్ లో మేనిఫెస్టో అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్న Nara Lokesh.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top