Pawan Kalyan as MP?
ఢిల్లీ నుండి లీకైన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఎంపీ (Pawan Kalyan as MP)గా పోటీ చేయమని బీజేపీ(BJP) నాయకత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య సజావుగా వ్యవహారాలు సాగడానికి కేంద్ర మంత్రివర్గంలో కూడా పవన్ కళ్యాణ్ ని చేర్చుకుంటారని హామీ ఇచ్చారట. దీనితో పవన్ కళ్యాణ్ లోక్ సభకి పోటీ చేయ బోతున్నారట. అనకాపల్లి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చట. ఇది చంద్రబాబు(Chandra Babu)కి కూడా సంతోషమే. కేంద్ర ప్రభుత్వం నుండి గరిష్ట సహాయం పొందడానికి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఉంటే మంచిదేగా.
Also Read: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..
ఇకపోతే ఇంతకు ముందు ఆయన సోదరుడు చిరంజీవి(Chiranjeevi) గారు కూడా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లోక్ సభకు పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా పని చేసినట్లు అవుతుంది.
లీకైన సమాచారం ఎంత వరకు నిజమో అన్న విషయం పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఎంపీ గా పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? కేంద్ర మంత్రి అయితే మాత్రం రాష్ట్రానికి ఎక్కువ సాయం అందించడం ఖాయమే. దానిలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో రెండు పవర్ సెంటర్లు ఉండవు కాబట్టి టీడీపీ కి కూడా సంతోషమే. ఇక నష్టాల విషయానికి వస్తే జనసేన(Janasena) పార్టీని బలోపేతం చేసుకోవడం కష్టం అవవచ్చు. ఇక్కడ ఉంటేనే పార్టీ నిర్మాణం సరిగా లేదు. ఇక ఢిల్లీ లో ఉంటే చెప్పనవసరం లేదు. చూద్దాం ఏమవుతుందో!