Pawan Kalyan to Godavari districts: పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారు!

Share the news
Pawan Kalyan to Godavari districts: పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మొదటి దశ పర్యటన ఖరారు!

Pawan Kalyan To Godavari Districts: ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్.. రా కదలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. ఆఖరికి ఏ బలమూ లేని కాంగ్రెస్ తరుఫున వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని ఇప్పటికే చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారన్న విషయాన్ని జనసేన(Janasena) పార్టీ వెల్లడించింది.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుంది. తొలి రోజు భీమవరంలో పవన్ కళ్యాణ్ వివిధ సమావేశాలలో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ఉన్న క్రియాశీలక కార్యకర్తలు, ప్రముఖులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కానున్న జనసేనాని.. వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వారితో చర్చించనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయని జనసేన వెల్లడించింది.

See also  TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

ఇక రెండో దశ పర్యటనలో స్థానిక కమిటీల నాయుకులు. కార్యకర్తలు, వీర మహిళల సమావేశాల్లో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top