Pawan Kalyan Warning
ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. ఇక ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దం పాటు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగిందని తెలిపారు. డబ్బు బలుపు, అహంకారంతో వైసీపీ ఎదిగిందని మండిపడ్డారు. అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలని ప్రశ్నించారు.
తన మీద కేసులే లేవని.. జగన్(YS Jagan) లాగా 32 కేసులు అసలే లేవని అన్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం నిలబడాలని బీజేపీ కేంద్ర నాయకులను అడిగితే తమతో కలిసి వచ్చారని అన్నారు. జనసేన(Janasena), తెలుగుదేశం(TDP) బీజేపీ(BJP) కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
నేను బయటకు రాగానే జగన్ కాపలా కుక్కలు తిడుతున్నాయి. వారికి డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువైంది. సజ్జల పులివెందుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలీదు. కానీ ఒక విప్లవ కారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వైసీపీ గుండా బ్యాచ్‌లు, రౌడీ మూకలను హెచ్చరిస్తున్నా. ఎన్నికల సమయంలో వెర్రికొర్రి వేషాలు వేస్తే తాట తీస్తా. నా మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించను’’ అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్(Pawan Kalyan Warning) ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు భారీ ఎత్తులో నిర్వహిస్తామని మాటిచ్చారు. నరసాపురం, కోససీమ వశిష్ట వారధి నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగనని జగన్ అన్నారని.. ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. అక్వా రైతులను జగన్ ముంచేశారని ధ్వజమత్తారు. అక్వా పరిశ్రమను గోదావరి జిల్లాల్లో సమూలంగా ముంచేశారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.
అక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఏపీలోనే ఉందని తెలిపారు. మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించానని గుర్తుచేశారు. మత్స్యకారులకు సంబంధించిన 217 జీవోను రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. జగన్ ప్యాలస్‌ల మీద ప్యాలస్‌లు కడుతున్నారని, మత్స్యకారులకు మాత్రం జెట్టీలు, హార్బర్లు మాత్రం కట్టడం లేదన్నారు. మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా రూ. 10 లక్షలు బీమా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Pawan Kalyan warning to Sajjala
మా అన్న చిరంజీవిని సజ్జల ఏమైనా అంటే సహించేది లేదు. ఆయన అజాత శత్రువు. ఆయన జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్(Pawan Kalyan Warning) ఇచ్చారు. మీరు నోరు జారండి, తప్పు చేయండి.. మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా. ఏమనుకుంటున్నావు.. జగన్ నీ గురించి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు కలుగుల్లో పందికొక్కులు..ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు’’ అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు.
ఇంతకీ సజ్జల ఏమ్మన్నారు చిరంజీవి(Chiranjeevi) గురించి..
చిరు వ్యాఖ్యల మీద స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతివ్వటంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ఎంతమంది వచ్చిన ఏపీలో జగన్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయ తెర మీద స్పష్టత ఉందనీ.. ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ఒక్కరూ ఒకవైపు ఉన్నారు.. మరోవైపు గుంటనక్కలు, తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమై వచ్చినా వైసీపీ విజయాన్ని, వైఎస్ జగన్ సీఎంగా కావటాన్ని అడ్డుకోలేరని సజ్జల అన్నారు.