
ప్రజాగళం సభ(Prajagalam Sabha)కు సైన్యం వలే పోటెత్తిన ప్రజలు -అనగాని
రేపల్లె(Repalle): అవినీతి జగన్(Jagan) పాలన పై ప్రజా సైనికులు యుద్ధం చేసేలా ప్రజాగళం సభ(Prajagalam Sabha) విజయవంత మైందని టిడిపి(TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభ (Prajagalam Sabha)కు వచ్చిన జన సందోహన్ని చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనపై యుద్ధం చేయడానికి వచ్చిన అఖండ సైనికుల వలె ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు ఎంత విసుగు చెందారో, ఎంత అణిచివేతకు గురయ్యారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనడానికి ప్రజగళం సభ(Prajagalam Sabha) కు పోటెత్తిన ప్రజలే నిదర్శనం అన్నారు.
టిడిపి(TDP), జనసేన(Janasena), బిజెపి(BJP) పార్టీలకు చెందిన అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో ప్రజాగళం సభ విజయవంతమైందన్నారు. రాజధాని రైతుల కంటతడి, ఇసుక దొరకక కార్మికులు ఎదుర్కొన్న ఆకలి కష్టాలు, ఆక్రందనలు, జగన్ పాలనలో అక్రమ కేసులు, బడుగు బలహీన వర్గాల హత్యలు, ఆవేదనలు, మద్యం తాగి కిడ్నీలు లివర్లు పాడై ప్రాణాలు కోల్పోయిన అనేకమంది బాధిత కుటుంబాల కష్టాలు, జగన్ మాఫియా చేతిలో బలైన ప్రజల కన్నీటి గాదలు వినిపించడానికి ప్రజాగళానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తారని వివరించారు. పోలీసుల వైఫల్యంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బందులు గురయ్యారని, అనేక మంది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ సభా వేదికకు వచ్చారని వివరించారు. 15 సంవత్సరాల తర్వాత లారీలపై, ట్రాక్టర్ల పై ప్రజలు సభలకు రావడం చూశానన్నారు. సిద్ధం సభల పేరుతో అధికార పార్టీ ప్రజలను బెదిరించి వాలంటీర్లు సహకారంతో సంక్షేమ పథకాలు ఆపేస్తామని, పింఛన్లు నిలిపేస్తామని, నివేసిన స్థలాలు పొందిన లబ్ధిదారుల పట్టాలను రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడి జనాన్ని తరలించారని విమర్శించారు.
యువ గళం, ప్రజాగణం సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని వివరించారు. 30 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి, తర్వాత గెలిచిన నాయకుడు పొత్తులపై మాట్లాడటం సిగ్గుచేటని అంబటి రాంబాబు పై చురకలాంటించారు.
కుటుంబాలలో చిన్న చిన్న విభేదాలు వస్తే పరిష్కరించుకుంటామని, ఆనాడు సిద్ధాంతపరంగా చిన్నచిన్న అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయామని నేడు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవినీతి పాలనను అంతమొందించేందుకు మూడు పార్టీలు ఓకే అజెండాతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసామన్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లిని దూషించిన వారికి, నేడు మంత్రివర్గంలో పదవులు ఇచ్చి పార్టీలో చేర్చుకోలేదా అని విమర్శించారు. అభివృద్ధిలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనుకబడిందని రాష్ట్ర పునర్ నిర్మాణం చేపట్టేందుకు పొత్తులు పెట్టుకున్నామన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు.
స్వార్ధ రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూడటం అవివేకం అన్నారు. వాలంటరీలు ప్రజాహితం కోసం పని చేయాలి కానీ పార్టీల కోసం కాదని చెప్పారు. పోలీసులు చట్టపరంగా నిర్వహించాల్సిన విధులను పార్టీలు కతీతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పనిచేయాలన్నారు. ప్రజాహితం కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థులను గెలిపించి, సైకో పాలనను తుదముట్టించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, పంతాన్ని మురళీధర్ రావు, వెనిగళ్ల సుబ్రమణ్యం, టిడిపి రైతు నాయకులు మేక శివరామకృష్ణ, ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు
-By Guduru Ramesh Sr. Journalist