Pithapuram: ముగిసిన పిఠాపురం పంచాయితీ.. వర్మకు MLC హామీ.. ఇక పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ ఖాయం!

Share the news
Pithapuram: ముగిసిన పిఠాపురం పంచాయితీ.. వర్మకు MLC హామీ.. ఇక పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ ఖాయం!

YCP అవినీతిపాలన అంతమే కూటమి లక్ష్యం

పిఠాపురం(Pithapuram) నుంచే పోటీ అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) మరియు అయన అనుచరులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయంగా తన ఉనికి ఏంటన్న ఆందోళతోనే వర్మ, తన అభిమానులతో ఈ యాగీ చేయించారా అనే అనుమానం వస్తుంది జనంలో. లోకల్ కార్డు ప్రయోగించాడు, స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ఫ్లెక్సీలు కూడా పెట్టించాడు. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా పిఠాపురం టికెట్‌ జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో వర్మ, ఆయన అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ ఫ్లెక్సీలు తగుల బెట్టారు. టీడీపీకి ,చంద్రబాబు(Chandra Babu)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read: పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది!

ముగిసిన పిఠాపురం(Pithapuram) పంచాయితీ

ఒక పక్క జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాష్ట్రం కోసం తమకు కేటాయించిన సీట్లు కూడా త్యాగం చేస్తుంటే, మరో పక్క వర్మ లాంటోళ్ళు సీట్ రాలేదని ఇలా యాగీ చేస్తే వైసీపీ కి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. అది కూటమికి మంచిది కాదు. ఇది తెలుసు కాబట్టే వర్మను ఉండవల్లి పిలిపించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). అధికారంలోకి వచ్చాక మొదటి ఎమ్మెల్సీ నీకే అంటూ వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో(2014) పవన్ రాష్ట్రం కోసం పొత్తులో వున్నా పోటీ చేయలేదని వర్మకు నచ్చజెప్పిన బాబు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. కనుక పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి మీరు. బాబు హామీ తో సంతృప్తి చెందిన వర్మ, పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని బాబుకు బాబుకు మాటిచ్చాడు  

See also  Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top