
Ramoji Rao ఇక లేరు!
హైదరాబాద్: Eenadu గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 4:50నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల చేసిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ICU లో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు.
రామోజీరావు 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు.