MLA Anagani: అభివృద్ది, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం… రేపల్లె ఎమ్మెల్యే అనగాని!

Share the news
MLA Anagani: అభివృద్ది, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం… రేపల్లె ఎమ్మెల్యే అనగాని!

అభివృద్ది, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం.. MLA Anagani

రేపల్లె : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ చంద్రబాబు నాయుడుకే(Chandra Babu Naidu) సాధ్యమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను అణిచి వేసేందుకు ఎన్డీయే(NDA) కూటమి ఏర్పడిందన్నారు. ఉగాది సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్బంగా రేపల్లె(Repalle) పట్టణ మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు టిడిపిలోనికి చేరటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలోకి చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలోనికి వలసలు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపికి మద్దతు తెలుపుతూ పలువురు పార్టీలోనికి రావటం శుభ పరిణామం అన్నారు.

రేపల్లె(Repalle) రూరల్ మండలం నల్లూరిపాలెం గ్రామానికి చెందిన మునిపల్లి కోటేశ్వరరావు, వీరవల్లి రాజకుమార్, తుమ్మల శ్యాంబాబు, గొరికపూడి ప్రభుదాసు, గాజులవర్తి కరుణాకర్, మామిళ్ళ రవి, అల్లూరి వంశీ, అల్లూరి పండుబ్బాయి మరికొంత మంది పార్టీలోకి చేరారు. పట్టణంలోని 20వ వార్డు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పంతగాని ప్రేమలత, చార్లెస్ దంపతులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే అనగాని వారికి కండువా కప్పి పార్టీలోక ఆహ్వానించారు.

See also  Alapati: ఆలపాటి అసంతృప్తి!.. 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీని వీడతారట!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన యువత పెద్ద ఎత్తున పార్టీలోనికి రావడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమ చంద్రబాబు తోనే సాధ్యం అన్నారు. రాష్ట్రంలో అరాచకం అణిచివేతలు అక్రమం అన్యాయాలు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైసిపి పాలకులు అభివృద్ధిని మరిచి, అవినీతి అరాచక పాలన సాగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో పాలనను తరిమికొట్టేందుకు టిడిపి(TDP), జనసేన(Janasena), బిజెపి(BJP) కూటమిగా ఏర్పడి ప్రజల పక్షాన పోరాడుతున్నాయని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, తాత ఏడుకొండలు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top