
Resignations from YCP
వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గారికి వరుస షాక్‌లు ఇస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు మరియు నేతలు. ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ(YCP) కి రాజీనామాలు(Resignations from YCP) చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) వైసీపీకి రాజీనామా చేశారు, దీంతో 175 ఏమో గానీ.. అసలు అధికారంలోకి రావడమే కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు(MS Babu) వైసీపీకి రాజీనామా చేశారు. కడపలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరారు. షర్మిల, బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక శుక్రవారం నాడు కూడా వైసీపీ పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని వీడి వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వరుసగా నేతలు పక్క పార్టీల వైపు చూస్తుండటంతో.. వైసీపీ అగ్ర నేతలు గందరగోళంలో పడిపోతున్నారు. వలసలు ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇక పోతే ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ చేనేత నాయకుడు గిర్రాజు నాగేష్ కూడా వైసీకి రాజీనామా చేశారు. ఇవాళ ముదిగుబ్బ మండలం ఎంపీపీ, ఎమ్మెల్యే వెంకట్రాం రెడ్డి ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. బలహీవర్గాలకు న్యాయం జరగడం లేదని, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 10 సీట్లు రెడ్లకు ఇచ్చారని బీసీ నేతలు ఆరోపించారు. పదవులన్నీ రెడ్డి కులస్తులకే వస్తున్నాయని బీసీ నేతలు వైసీపీనీ వరసగా వీడుతున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.