Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

Resignations row in YCP continues: ఇంచార్జ్ ల మార్పుతో, వచ్చే ఎలక్షన్స్ కి టికెట్ దక్కని నాయుకులు వైసీపీ కి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Share the news
Resignations row in YCP continues: YCP పార్టీకి, ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

Resignations row in YCP continues

వైసీపీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి సైతం గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Krishna Devarayalu)… తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో… పోటీ చేసేందుకు నిరాకరించారు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని…గుంటూరుకు మారేది లేదని తెగేసి చెప్పారు. వైసీపీ నర్సరావుపేట టికెట్ ఇవ్వకపోవడంతో…ఆ పార్టీకి రాజీనామా చేశారు.

రాజకీయంగా కొంత అనిశ్చతి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడిని కాదన్నారు. నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోందని.. దీని వల్ల కేడర్ కొంత కన్ఫ్యూజన్‌లో ఉందన్నారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని.. గత ఎన్నికలలో మంచి మెజారిటీతో పార్లమెంట్‌కు పంపించారన్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇవాళ మాచర్ల, పెదకూరపాడు, నరసరావుపేట ఎమ్మెల్యేలు ఎంపీని కలిసేందుకు బయల్దేరగా.. ఈలోపే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

See also  MLA Anagani: అభివృద్ది, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం… రేపల్లె ఎమ్మెల్యే అనగాని!

Resignations row in YCP: టీడీపీ / జనసేన పైన ప్రభావం

ఇది వైసీపీకి దెబ్బె కానీ షాక్ మాత్రం కాదు. నియోజకవర్గం మార్పు పేరుతో పార్టీలోని కొంత మంది నాయకులను పొగ పెట్టి పంపుతున్నటుంది. వాళ్లంతా ఇప్పుడు టీడీపీ / జనసేన లో చేరుతున్న సంగతి తెల్సిందే. వైసీపీ నుంచి టీడీపీ / జనసేన లో చేరే వారి సంఖ్య ఎక్కువైతే ఆయా పార్టీల్లో ఆల్రెడీ టిక్కెట్ ఆశిస్తున్నా వాళ్ళ పరిస్థితి ఏమిటో ?? వాళ్లకు టికెట్ రాకపోతే వాళ్ళు రాజీనామా చేయరా ??

Also Read News

Scroll to Top