Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

Share the news
Ongole MP Seat: ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

ఇప్పటికే అంతర్గత సర్వేలా ద్వారా సిట్టింగుల పై రిపోర్ట్ తెప్పించుకుని, సరిగా పని చేయని సిట్టింగులకు టికెట్ నిరాకరణ, కొంత మందికి వేరే నియోజకవర్గం కేటాంచడం వంటి వాటితో పార్టీలో గందరగోళం నెలకొనగా ఇప్పుడు రోజా(Roja)కు ఒంగోలు ఎంపీ సీట్(Ongole MP Seat) అంటూ మరో గందరగోళంకి తెరతీయనుందా వైసీపీ(YCP)? అవును అంటున్న రాజకీయ విశ్లేషకులు.

Ongole MP Seat

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం. అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును పేరును పార్టీ ప్రతిపాదించిగా, మాజీ మంత్రి బాలినేని సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.. ఇక ఇప్పుడు రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లు టాక్.

See also  YS Sunita: వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

ఇకపోతే 2019 ఎన్నికల్లో రోజా నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి MLA గా గెలిచిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం టూరిజం మంత్రిగా చేస్తున్న ఆవిడకి స్థానికంగా వ్యతిరేకత బాగానే వుంది, దాంతో ఆవిడను ఒంగోలు నుంచి ఎంపీ గా పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక చోట జనంలో వ్యతిరేకత ఉందని మరోచోటుకు మార్చడం అనే వ్యూహం పని చేస్తుందా లేదా అనేది ఎన్నికల తరువాత మాత్రమే తెలుస్తుంది.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top