
అవ్వ తాతలకు Rs 4000 Pension!
రేపల్లె(Repalle) : రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) తోనే సాధ్యమని టిడిపి(TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూటమి ఉమ్మడి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని నగరం మండలం పెద్దవరం, తోటపల్లి, నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెం, రేపల్లె మండలం గుడి కాయలంక గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ,మహిళలు బారులు తీరు అనగానికి ఘన స్వాగతం పలికారు.



ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అవినీతి, అక్రమాలతో పాటు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వాలంటరీ(Volunteer) లను తన సొంత పార్టీ మనుషులు అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను విధుల నుంచి దూరం చేసిందని చెప్పారు. శవ రాజకీయాలకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫిర్యాదుతో వాలంటీర్లను తీసివేసారని అవ్వ తాతలను నమ్మించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అయితే అవ్వ తాతలకు పింఛన్ అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4000 రూపాయల పింఛన్(Rs 4000 Pension) అందజేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి బకాయలు రూ 3000, మరియు జులై నెలలో వచ్చే రూ.4000 పింఛన్(Rs 4000 Pension) మొత్తం రూ. 7000 రూపాయలు పింఛన్లు జూలైలో ఇవ్వటం జరుగుతుందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను, బిసి డిక్లరేషన్ ద్వారా అమలయ్యే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 , ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుతున్న ఒక్కొక్కరికి రూ.15000, ఇంటింటికి తాగునీటి పథకం ద్వారా సురక్షిత తాగునీరు ఇస్తామని, ప్రతి రైతుకు ఏటా రూ .20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువగళం నిది కింద నెలకు రూ. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలకు వివరించారు.ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు యువత బంగారు భవిష్యత్తు కొరకు కూటమి గా ఏర్పడి నట్లు చెప్పారు.



అనంతరం రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో మాజీ ఎంపీటీసీ యరగళ్ళ వీరయ్య ఆధ్వర్యంలో వందమంది మత్స్యకారులు తెలుగుదేశం పార్టీలోని చేరారు వీరికి అనగాని సత్యప్రసాద్ కండవాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంతాన్ని మురళీధర్ రావు, గూడపాటి శ్రీనివాసరావు. నాయకులు తాత ఏడుకొండలు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist