Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

Share the news
Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

ఏపీ ఇంఛార్జీ డీజీపీగా Shankhabrata Bagchi

AP DGP: Andhra Pradesh ఇంఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (Shankhabrata Bagchi) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ నియామకంపై ఈసీ(EC) తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ఇకపోతే, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ పోస్టు కోసం సోమవారం ఉదయం 11 గంటలలోపు ముగ్గురు డీజీ ర్యాంక్ స్థాయి అధికారుల జాబితాను పంపించాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ ల వివరాలను ప్యానెల్ తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి నిర్దేశించింది.

See also  Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో 'నాటు నాటు' పాటకి కాలు కదిపిన రాంచరణ్!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top