
అనుకున్నట్లే వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీని (YSRTP) కాంగ్రెస్ (Congress)లో విలీనం చేశారు. ఈ రోజు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
Sharmila merged YSRTP in Congress
నిన్న (బుధవారం) రాత్రి భర్త అనిల్ (Anil)తోపాటు ఢిల్లీ(Delhi) చేరుకున్నారు వైఎస్ షర్మిల. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని కలిశారు. ఈ రోజు తన భర్త అనిల్ తో కలసి AICC కార్యాలయానికి వెళ్లారు. తదనంతరం జరిగిన కార్యక్రమంలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో YSRTP ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసినట్లయింది.
ఈ సందర్బంగా మాట్లాడుతు ఆమె “కాంగ్రెపార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని విలీనం చేశామని అన్నారు. “కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నేతని, ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారని” ఆమె గుర్తుచేశారు. ఇంకా ఆమె “కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాలను కలుపుకుంటూ పని చేస్తుందని” అన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్సార్ ఆశయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దాని కోసం తానూ మనస్ఫూర్తిగా పని చేస్తాను అని అన్నారు.
వైఎస్ షర్మిలకు… ఏఐసీసీ (AICC)లో చోటు కల్పించడం లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ (APCC) అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే… షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.