Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..

Sharmila took charge as APCC Chief: PCC నియామక పత్రాలను షర్మిలకు అందించిన గిడుగు రుద్రరాజు. బాధ్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు.
Share the news
Sharmila took charge as APCC Chief: అన్నయ్య పై విమర్శలు.. ఏపీ దుస్థితికి బాబు, జగనే కారణం..

Sharmila took charge as APCC Chief

APCC Chief బాధ్యతల స్వీకరించిన తరువాత వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) మాట్లాడుతూ..

మహానేత YSR రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి PCC గా పనిచేశారు. మళ్ళీ రెండు సార్లు YSR ముఖ్యమంత్రిగా గెలిచారు. అదే APCC Chief పదవిని..ఇంతటి బాధ్యతను వైఎస్సార్ బిడ్డను నమ్మి కాంగ్రెస్(Congress) పార్టీ పెద్దలందరూ నమ్మి ఇవ్వడం గర్వకారణం. ఇంత నమ్మకాన్ని నాపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్న.

APCC Chief షర్మిల fires on TDP and YCP

ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు, నమ్మకస్తులు, క్యాడర్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాలని కోరుకున్నారు గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో YSRCP అధికారంలో ఉంది. అంతకు ముందు TDP అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదు.

రాష్ట్రం విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు. TDP అప్పులు 2 లక్షలు కోట్లు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన 3 లక్షల కోట్లు అప్పులు. అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన 10 లక్షల కోట్లు అప్పులు. ఇంత అప్పులు చేశారు…ఇన్ని డబ్బులు తెచ్చారు .అభివృద్ధి బూతద్దం పెట్టీ చూసినా ఎక్కడా కనపడదు

రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా ? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదు. 10 ఏళ్లలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. పరిశ్రమలు వస్తె మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. కనీసం ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు. అభివృద్ధి లేదు. కానీ..దళితుల పై మాత్రం 100 శాతం దాడులు పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా,ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా. దోచుకోవడం దాచుకోవడం ఇదే పని

See also  CBN Raa Kadalira.. MandaPeta Meeting: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం

ప్రత్యేక హోదా ఉద్యమం గురించి, APCC Chief షర్మిల

10 ఏళ్లు అయ్యింది ప్రత్యేక హోదా హామీ ఇచ్చి. 10 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటి ఉద్యోగాలు వచ్చేవి.. పరిశ్రమలు వచ్చేవి. హోదా రాలేదు అనడం కంటే..పాలకులు తేలేక పోయారు అనడం కరెక్ట్. ఉత్తరంఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి..500 శాతం కొత్త ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో హోదా ఇవ్వడం ద్వారా 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి

మనకు ఎందుకు రాదు స్పెషల్ స్టేటస్ ? పాలకులు హోదా తేవడం లో విఫలం అయ్యారు..వాళ్లకు చేతకాలేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నాడు. అందుకే బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టీ ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు.

ఇక జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతా అన్నాడు. టిడిపి మద్దతు ఇస్తే.. మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నాడు. జగన్ రెడ్డి CM అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదు. ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు ది..జగన్ రెడ్డిది.

స్వలాభం కోసం రెండు పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయి. ఇక అమరావతి..రాజధాని అన్నాడు చంద్రబాబు. సింగపూర్ చేస్తా అన్నాడు..3D గ్రాఫిక్స్ చూపించారు. ఇక జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నాడు. మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేదు. మన రాజధాని ఏది అంటే మనకే తెలియదు. ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి

See also  AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏపీ సీఐడీ..

పోలవరం గురించి, APCC Chief షర్మిల

పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంబించింది YSR. YSR ఉన్నప్పుడు కుడి ఎడమ కాలువలు పూర్తి చేశాడు. YSR చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదు. బీజేపీ తో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టింది. ఇటు జగన్ రెడ్డి సైతం బీజేపీ తో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు.

బీజేపీ అధికారంలో 10 ఏళ్లు ఉండి…ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలలో మన ఆంధ్ర కి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ? కొత్త ఉద్యోగాలు కాదు కదా… ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి. ఆంధ్రలో ఒక లక్ష ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేక పోయింది.

దేశంలో బీజేపీ అధికారంలో ఉండి రైతులను మోసం చేసింది. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడు. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వెనక్కు తెచ్చి రైతుల అకౌంట్ లో వెస్తం అన్నది బీజేపీ. ఒక్క రైతు అకౌంట్ లో అయినా డబ్బులు పడ్డాయా ? ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే…టీడీపీ,వైసీపీ ఎందుకు తొత్తులుగా మారారు?

రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ లు బీజేపీ చెప్పు జేతల్లో ఉన్నారు. ప్రజలు బీజేపీ కి ఓటు వేయక పోయినా… టిడిపి,వైసీపీ ఎంపీ లు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి,వైసీపీ కి ఓటు ఎందుకు వేయాలి. బీజేపీ కి అమ్ముడు పోవడానికి వైసీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి…టీడీపీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి.

See also  Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా!

ఇదే నిజం…లేకుంటే 5 ఏళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీ నీ విమర్శ చేయలేదు చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే బీజేపీ కి సపోర్ట్ చెయ్యండి…ప్రజలు సంతోషిస్తారు. పోలవరం ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయి నిధులు ఇచ్చి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళు. రెండు కోట్ల ఉద్యోగాలలో మన వాట వచ్చి ఉంటే వర్షించే వాళ్ళు. రైతుల అకౌంట్ లో నిధులు వేసి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళు

క్రైస్తవుల మనోభావాలు పై APCC Chief షర్మిల

జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదు. మణిపూర్ లో 2 వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదు. టిడిపి సైతం అదే వైఖరి లో ఉంది

APCC Chief షర్మిల YSR జపం

వైఎస్సార్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి. బీజేపీ మత తత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి..చలి కాచుకోవాలి.. ఇదే బీజేపీ మంత్రం. వైఎస్సార్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్ లోనే నెరవేరాయి.YSR ఆశయాలు ఏ పార్టీలో నెరవేరలేదు. వైఎస్సార్ మూలాలు కాంగ్రెస్ పార్టీ. వైఎస్సార్ ఊపిరి కాంగ్రెస్ పార్టీ. వైఎస్సార్ ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదాం. వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ ఆశయాలను సిద్దింప జెద్ధాం. నేను రెడీ…మీరు రెడీనా..?

కొసమెరుపు: అన్న ప్రాసన రోజే ఆవకాయ అన్నట్లు.. చాలా ఎక్కువ మాట్లాడేశారు మేడం.. వచ్చే 5 సంవత్సరాలకు సరిపడా.. రేపటి నుంచి మాట్లాడానికి ఏమీ లేదు ఇక ఆవిడకి..

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top