Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం

Share the news
Sons of YCP Leaders Campaign: గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకుల తనయుల ఇంటింటి ప్రచారం

Sons of YCP Leaders ఇంటింటి ప్రచారం

రేపల్లె(Repalle) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసిపి అభ్యర్థులకు శ్రీరామరక్ష అని ఎంపీ మోపిదేవి(MP Mopidevi), డాక్టర్ గణేష్ ల తనయులు(Sons of YCP Leaders) మోపిదేవి రాజీవ్, డాక్టర్ సృజన్ స్పష్టం చేశారు. గెలుపే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వారు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

పట్టణంలోని 22వ వార్డులో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార పరంపరలో మోపిదేవి రాజీవ్, డాక్టర్ సృజన్ లు తనదైన శైలిలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ, అభ్యర్థి డాక్టర్ గణేష్ ను గెలిపించాలంటూ అభ్యర్థించారు. దుకాణాలు, హోటల్స్, చిన్న చిన్న స్టాల్స్ మరియు రోడ్డు ప్రక్కన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను సైతం ఆత్మీయంగా పలకరిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రచారంలో తమదైన శైలిలో ముద్ర వేశారు. ఆత్మీయ పలకరింపులతో పులకరిస్తున్న సామాన్యులు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని వాగ్దానం చేస్తున్నారు.

See also  YCP Candidates List: వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 32మంది, ఎంపీలు 14మంది ఔట్!

ఈ సందర్భంగా మోపిదేవి రాజీవ్, డాక్టర్ సృజన్ మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా కుల మతాల కతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజల సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు. మీ కుటుంబాలలో మంచి జరిగిందని పిస్తేనే ఓటేయమని అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా ఓటు అడిగిన నేతలు లేరని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గణేష్ ను ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఎంపీ మోపిదేవి సారధ్యంలో రేపల్లెలో వైసిపి అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ ఘనవిజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తూనుగుంట్ల కాశీ విశ్వనాధ గుప్తా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిమట బాలాజీ, 22వ వార్డు కౌన్సిలర్ బేతపూడి కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ షేక్ బాజీ బాబా వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top