Jai Pawan: సీఎం జగన్ ముందే పవన్ కి జై కొట్టిన విద్యార్థులు! ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఇదేనా?

Share the news
Jai Pawan: సీఎం జగన్ ముందే పవన్ కి జై కొట్టిన విద్యార్థులు! ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఇదేనా?

ఆపద్ధర్మ సీఎం ఎదుటే Jai Pawan అన్న విద్యార్థులు

కాకినాడ(Kakinada) సిద్ధం బస్సు యాత్రలో ఆపద్ధర్మ సీఎం జగన్(YS Jagan) కి షాక్ తగిలింది. యాత్రలో జగన్ కోసం తీసుకొచ్చిన విద్యార్థులు, పవన్ కళ్యాణ్ కి జై ((Jai Pawan) కొట్టారు. కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ADB రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం వుంది. శుక్రవారం ఈ విశ్వవిద్యాలయం ముందుగా యాత్ర సాగనుందని తెలుసుకున్న యాజమాన్యం, విద్యాదీవెన తో మేలు జరిగిందని “థాంక్యూ సీఎం సార్ ” అని ఫ్లెక్సీ వేసి విద్యార్థులతో చెప్పిద్దామని ప్లాన్ చేశారు. అది తీరా బెడిసికొట్టింది.

ఫ్లెక్సీతో విశ్వవిద్యాలయం ముందు గుమికూడిన విద్యార్థులను చూసి జగన్ బస్సు ఆపి కళాశాల వైస్ చైర్మన్ తో మాట్లాడి విద్యా దీవెన అందరికి అందుతుందా అని అడిగారు. ఇంతలో విద్యార్థులు “బాబులకు బాబు.. కళ్యాణ్ బాబు” అంటూ నినినాదాలు చేశారు. నినాదాలు తీవ్రత పెరిగే సరికి అసహనంతో జగన్ అక్కడినుంచి వెళ్లిపోయారు.

See also  Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN

అసలే సిద్ధం బస్సు యాత్రకు జనాదరణ లేక పోవడంతో ఖంగు తింటున్న వైసీపీ, ఇలాంటి నినాదాలతో మరింత ఢీలా పడటం ఖాయం. ఇక రాజకీయ విశ్లేషకులు ఈ సంఘటనను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు. కూటమి గెలుపు మీద ఎవరికి అనుమానం లేదు, ఆఖరికి వైసీపీతో సహా. ఇకపోతే చర్చంతా కూటమి ఎంత ఘన విజయం సాదించ బోతుంది లేదా వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోబోతుంది అనేది దాని మీదే నడుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top