
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన Sujana Chowdary
మర్యాదపూర్వకంగా జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో(Pithapuram) కలిసి అభినందనలు తెలిపిన సుజనా చౌదరి(Sujana Chowdary). ఈ సందర్బంగా ఏపిలో మూడు పార్టీల పొత్తు కోసం పవన్ చేసిన కృషికి అభినందనలు తెలిపారు సుజనా చౌదరి. రాష్ట్రంలో దుష్టపాలనని అంతమొందించి, ప్రజా ప్రభుత్వం ఏర్పడటం కోసం జనసేన చేసిన త్యాగాల గురించి కూడా ప్రస్తావించారు.
పొత్తు కోసం తన సొదరుడు నాగబాబు పోటీలో నుంచి వైదొలగాల్సి వచ్చినా కూడా దానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ఇక పోతే సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ(BJP) నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. “తన గెలుపు సునాయాసం అని అన్న మాటలకి పవన్ కి ఈ సందర్భంగా సుజనా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పారు సుజనా చౌదరి.
I had the pleasure of meeting Jana Sena Chief Pawan Kalyan Garu today in Pithapuram. During our interaction, I congratulated him for his pivotal role in forming the alliance in Andhra Pradesh. I also commended him and his party for the sacrifices they've made to oust the current… pic.twitter.com/F6Rn7y9ceG
— YS Chowdary (@yschowdary) April 2, 2024