Supreme Court on CBN Quash Petition: బాబు క్వాష్ పిటీషన్ పై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ..!

Share the news

17-A కేసులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు

చంద్రబాబుకు 17-A వర్తిస్తుంది.. జస్టిస్ బోస్

చంద్రబాబుకు 17-A వర్తించదు.. జస్టిస్ బేలా త్రివేది

17-A అంశాన్ని చీఫ్ జస్టిస్ వద్దకు తీసుకెళ్లిన ద్విసభ్య ధర్మాసనం

దీంతో కేసులో మళ్లీ మెలిక..

Supreme Court on CBN Quash Petition: బాబు క్వాష్ పిటీషన్ పై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ..!

Supreme Court on CBN Quash Petition

చంద్రబాబు(Chandra babu)కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై డివిజన్ బెంచ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ బేలా త్రివేదీ తీర్పులో తెలిపారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే ట్రయల్ కోర్టు (విజయవాడ ఏసీబీ కోర్టు ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు.

కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభ్రిప్రాయలు వ్యక్తం చేయడంతో.. చివరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

See also  Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్!

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి లేకుండా AP CID తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టు లో చంద్రబాబు(Chandra Babu) స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అక్టోబరు 17న తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా తీర్పు వెలువరించారు. CBN Quash Petition పై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్‌ను పంపమని సీజేఐ(CJI)కి నివేదిస్తామని న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది తెలిపారు.

-By Guduru Ramesh, Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top