పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది!

Share the news
పక్కా ప్లాన్ తోనే పిఠాపురం నుంచి.. గ్రౌండ్ రిపోర్ట్ కూడా Pawan Kalyan కి తిరుగు లేదని చెబుతుంది!

పిఠాపురం నుంచి Pawan Kalyan గెలుపు పక్కా

నిన్నటి దాకా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, అప్పుడే జనసేన శ్రేణులు పిఠాపురంలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక అసలు విషయమేంటంటే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అందరికన్నా ముందుగా విషయాన్ని తెలుసుకున్నది మాత్రం వైసీపీనే. అందుకే, తమకు అనుకూలంగా వుండే అధికారాలను అక్కడ నియమిస్తూ వచ్చారు. పోయిన సారి లాగా ఈసారి కూడా ఆయన్ను అసెంబ్లీ కి రాకుండా చేద్దామని. కానీ ఈ సారి ఆ పప్పులేమి ఉడికేలా లేవు.

అయితే కొద్ది నెలల క్రితం వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన పార్టీ(Janasena Party), పిఠాపురం నియోజకవర్గంలో సర్వే చేయించినట్లు తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గాల్లో ఈ సర్వేలు జరిగాయి అని అంటున్నారు. భీమవరం, పిఠాపురం రెండు చోట్లా కూడా జనసేనానికి సానుకూలత వ్యక్తమయ్యిందట ఆ సర్వేల్లో. అయితే, భీమవరం కంటే ఎక్కువ మెజార్టీ పిఠాపురంలో దక్కుతుందని సర్వేలు తేల్చడంతో, పిఠాపురం వైపే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.

See also  Land Titling Act: ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టే -రేపల్లెలో పవన కళ్యాణ్!

ఇక పిఠాపురం నుంచే పోటీ అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) మరియు అయన అనుచరులు నానా యాగీ చేశారు. అయితే, రాజకీయంగా తన ఉనికి ఏంటన్న ఆందోళతోనే వర్మ, తన అభిమానులతో ఈ యాగీ చేయించారా అనే అనుమానం వస్తుంది జనంలో. లోకల్ కార్డు ప్రయోగించాడు, స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ఫ్లెక్సీలు పెట్టించాడు. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా పిఠాపురం టికెట్‌ జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో వర్మ, ఆయన అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ ఫ్లెక్సీలు తగుల బెట్టారు. టీడీపీకి ,చంద్రబాబు(Chandra Babu)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఒక పక్క జనసేనాని రాష్ట్రం కోసం తమకు కేటాయించిన సీట్లు కూడా త్యాగం చేస్తుంటే, మరో పక్క వర్మ లాంటోళ్ళు సీట్ రాలేదని ఇలా యాగీ చేస్తే వైసీపీ కి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. అది కూటమికి మంచిది కాదు. ముఖ్యంగా టీడీపీ కి. ఇలాంటి వాటిని పక్కాగా కంట్రోల్ చేయాలి, లేదంటే పొత్తులో విభేదాలు పెట్టడానికి వైసీపీ రెడీగా ఉంటుంది.

See also  చిన్ననాటి నగ్న ఫోటో అప్లోడ్ చేసిన Gujarat Man.. అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్..

యాగీ చేసినా వర్మ టీడీపీని వీడే అవకాశం లేదు అంటున్నారు. ఒకవేళ వర్మ తెరవెనుకాల పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పని చేసినా లేదా వైసీపీ కి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేసిన కూడా పిఠాపురం లో జనసేనానికి మెజార్టీ తగ్గబోదు అంటున్నారు. ఎందుకంటే పిఠాపురం నియోజక వర్గం పవన్ కళ్యాణ్ పై పూర్తి సానుకూలంగా ఉందంటున్నారు. అసలు వర్మ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పని చేయబోరని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. చూద్దాం ఏం జరగనుందో

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top