Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ.. ఎమ్మెల్యే అనగాని

Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ . చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కూటమికి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరరణ లభిస్తున్నదని చెప్పారు. అందుకు నిదర్శనం ప్రతి గ్రామం నుండి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అనగాని వివరించారు.
Share the news

చంద్రబాబుతోనే సుపరిపాలన..ఎమ్మెల్యే అనగాని
టీడీపీ-జనసేన(TDP Janasena) కూటమికి ప్రజాదరణ

Sure win to TDP Janasena alliance: టీడీపీ-జనసేన కూటమికే ప్రజాదరణ.. ఎమ్మెల్యే అనగాని

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమైతుందని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా, రేపల్లె నియోజకవర్గంలోని కూచినపూడిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

తెలుగు యువత అధ్యక్షులు కొలసాని రాము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమనికి హాజరైన ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ కు గ్రామస్తులు, మహిళలు, పార్టీ శ్రేణులు హారతులు ఇస్తూ, మేళతాళాలతో పెద్దఎత్తున స్వాగతం పలికారు. జై అనగాని అని, రేపల్లె గడ్డ, అనగాని అడ్డా అని, కాబోయే మంత్రి అనగాని అంటూ నినాదాలు చేశారు.

TDP Janasena alliance కి విజయం తథ్యం

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు(Chandra Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో టీడీపీ జనసేన(TDP Janasena) కూటమికి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరరణ లభిస్తున్నదని చెప్పారు. అందుకు నిదర్శనం ప్రతి గ్రామం నుండి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని వివరించారు. వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు విరక్తి చెందారని చెప్పారు. వైసీపీ పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం మూడు దశాబ్దాలు వెనక్కు వెళ్లిందన్నారు. భావితరాల భవిష్యత్తును కాపాడాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ప్రధాన అజెండాగా ప్రజలకు సుపరిపాలన అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో అరాచక పాలనకు చమరగీతం పాడేందుకు టీడీపీ శ్రేణులు సైనికుల్లా పనిచెయ్యాలని పిలుపునిచ్చారు.

See also  Seat-Sharing Talks: చివరి దశకు చేరిన సీట్ల పంపకాల చర్చలు.. 10 ఎంపీల సీట్ల కోసం బీజేపీ బేరం..

కార్యక్రమంలో అనగాని శివ ప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, పంతాని మురళిధరరావు, పరిటాల యువసేన అధ్యక్షులు దండమూడి ధరణీ కుమార్, వేమూరి అజయ్, ధర్మతేజ, సురేష్ పి. కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top