Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని!

Share the news
Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని!

బాపట్ల జిల్లా రేపల్లె(Repalle): విలువలతో కూడిన సెక్యులర్ నేత చంద్రబాబు నాయుడు అని, ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని(Muslim Community) భయభ్రాంతులకు గురి చేసే విధంగా YCP పార్టీ అభ్యర్థి డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడటం సిగ్గుచేటని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) ధ్వజమెత్తారు.

ఓట్ల కోసం Muslim Community ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడిన గణేష్ పై మండిపడ్డ TDP ఎమ్మెల్యే అనగాని

ఆదివారం పట్టణంలోని 26 27 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఈవూరి గణేష్(Evuri Ganesh) ముస్లిం సమాజం(Muslim Community)తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
“మై డాక్టర్ గణేష్, ….. ఎంపీ సాబ్ తుమ్హారా పాస్ ఓట్ కేలియే ఆయా… ఆశీర్వాద్ కరో…. తుమారా పామ్ కు ప్రమాణ్ కర్త …. ఓ మతతత్వ పార్టీ బిజెపి సబ్ కో మాలూమ్…. టిడిపి, జనసేన, బిజెపి.. మిల్కర్…. ఓ తీన్ ఆద్మీ హమారా పాస్ కేలియే ఆయా… మైనార్టీలకో ఖతం కర్నే కేలియే ఆయా…. హంకో యాంటీ కర్ణనే కేలియే ఓ తీన్ ఆద్మీ ఆయా….. వారికి బుద్ధి చెప్పాలి.

See also  Mangalagiri: మంగళగిరికి మహర్దశ.. మోడల్ సిటీ గా అభివృద్ధి చేస్తా! -యువనేత లోకేష్

ఇది రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గణేష్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చేసిన వ్యాఖ్యలు.

బిజెపి(BJP) మతతత్వ పార్టీ అని ఈ విషయం అందరికీ తెలుసు అని అలాంటి పార్టీతో టిడిపి(TDP), జనసేన(Janasena) పొత్తు పెట్టుకుని ఉన్నాయని, ఓట్ల కోసం మన దగ్గరికి వస్తారని ఎందుకు వస్తారంటే మైనార్టీలను కతం చేయడానికి వస్తారంటూ ముస్లిం సోదరులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.

బిజెపితో మైనార్టీలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తూ ఓట్లను దండుకోవాలని చూడటం ఏంటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేనకు 24 సీట్లేనా… పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని అడగమంటూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు ముస్లిమ్ సమాజం(Muslim Community) లో అలజడలు సృష్టించేందుకు బిజెపితో, మైనార్టీలకు ఇబ్బంది కలుగుతుందని ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండించారు. 2014 నుండి 2018 వరకు చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ ముస్లిమ్ సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. చంద్రబాబు నాయుడు విలువలతో కూడిన సెక్యులర్ నాయకులని మతసామరస్యానికి టిడిపి పెట్టింది పేరని గుర్తు చేశారు.

See also  IND vs ENG 3rd Test Day 3: యశస్వి జైస్వాల్ సెంచరీ.. శుభ్‌మన్ గిల్ 50.. భారత్ ఆధిక్యం 300+

కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టే విధంగా వైసిపి నాయకులు ఇలా అమాయక ముస్లిమ్ సమాజా(Muslim Community) న్ని ఓట్ల కోసం రాజకీయంగా వాడుకోవాలని చూడటం అవివేకం అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేయాలని చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఏఐ(AI) టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక దుల్హన్ పథకం నిర్వీర్యమైపోయిందని, హజ్ యాత్రలకు ప్రోత్సాహం కరువైందని వివరించారు. చెయ్యని తప్పుకు చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి బాబాయి హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అంటూ తప్పుడు కథనాలు రాయడం, కోడి కత్తి డ్రామాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలవాటని ధ్వజమెత్తారు.

ముస్లింలకు హామీలిచ్చి, మోసం చేసిన మోసగాడు జగన్ ఏ మొఖం పెట్టుకుని, మళ్ళీ ఓట్లు అడుగుతాడని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సమాజానికి పలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని గుర్తు చేశారు.ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, 45 ఏళ్లకే ముస్లింలకు పెన్షన్ సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ముస్లిమ్ యువతి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని, రంజాన్ తోఫా కి మించిన పథకం తెస్తానని పలు హామీలు ఇచ్చి ముస్లిం సమాజాన్ని మాయ చేశారని ధ్వజమెత్తారు.

See also  Ambati Rambabu dances again: అంబటి అదిరే స్టెప్పులు.. మంత్రి రాంబాబు సంక్రాంతి సంబరాలు..

మైనార్టీ కార్పొరేషన్ నిధులతో కేవలం ముస్లిం పధకాలు పెడతానని, విదేశీ విద్య అద్భుతంగా ఇస్తామని, వక్ఫ్ బోర్డు ఆస్తులు రీసర్వే చేపిస్తామని గాలి కబుర్లు చెప్పారని విమర్శించారు. ఇమామ్ లకు ఇళ్ళ స్థలాలు మంజూరు, ఇమామ్ లకు నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం, మౌజమ్ లకు నెలకు రూ.15 వేలు గౌరవ వేతనం హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.

ముస్లింలు చనిపోతే రూ.5 లక్షల ప్రమాద భీమా అందిస్తామని, నామినేటడ్ పదవుల్లో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చేసిన హామీలు నెరవేర్చడం చేతగాని వైసీపీ సర్కార్ ఈరోజు ఓట్ల కోసం కుల మతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడటం చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో ముస్లింలందరూ ఐకమత్యంతో కూటమి నాయకులను గెలిపించాలని కోరారు. ముస్లిమ్ సమాజాని(Muslim Community) కి టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top