TIDCO Houses: టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రేపల్లె జనసేన అధ్యక్షులు రాసంశెట్టి మహేష్!

టిడ్కో గృహాలను(TIDCO Houses) కక్షగట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వేర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన టిడ్కో గృహాలను నిలుపుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
Share the news
TIDCO Houses: టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రేపల్లె జనసేన అధ్యక్షులు రాసంశెట్టి మహేష్!

TIDCO Houses లను నిర్వీర్యం చేసిన వైసీపీ

రేపల్లె (Repalle): టిడ్కో గృహాలను(TIDCO Houses) కక్షగట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వేర్యం చేసిందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ విమర్శించారు. గురువారం పట్టణంలోని నిరాదరణకు గురైన డిడ్కో గృహాల వద్ద జనసేన(Janasena), టిడిపి(TDP), బిజెపి(BJP) నేతల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం పేదలందరూ గౌరవంగా తలెత్తుకొని బ్రతికే విధంగా జి ప్లస్ త్రీ నిర్మాణాలను చేపట్టిందని గుర్తు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా ఆపివేసిందన్నారు. వివిధ కేటగిరీల్లో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు ఇవ్వకుండా నిలిపివేసి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఉండి లేక పేదలు నిర్మాణాలు చేపట్టేందుకు అప్పులు చేసి డబ్బులు కట్టారని తెలిపారు. అయితే వైసిపి ప్రభుత్వం ఆ భవనాలపై కూడా బ్యాంకు రుణాలను తీసుకోవటం వలన లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు పంపిస్తుందని చెప్పారు.

See also  Jagan Will Remain as a Failure CM: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు -CBN

పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఆశయమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన టిడ్కో గృహాలను నిలుపుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గోగినేని పట్టాభి రామారావు, వెనిగళ్ళ సుబ్రమణ్యం, జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top