Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది???

Share the news
Future of YCP: ఈ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది???

Future of YCP

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో Jagan Mohan Reddy వైసీపీ భవిష్యత్తు(Future of YCP) ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఏదో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారనో లేక ఎవరో జర్నలిస్ట్ కి కల వచ్చిందనో కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంఘటనలను వరుసగా క్రోడీకరించుకుంటూ పోతే ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమౌతుంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్న చందంగా వైసీపీ(YCP) కి ఎదురుకాబోతున్న ఓటమికి కూడా అనేక కారణాలను చెప్పొచ్చు. అవన్నీ రాసుకుంటూ పోతే అది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.. ఎలక్షన్స్ టైం కాడా దాటిపోతుంది. అందుకే కొన్ని కారణాలను పరిశీలిద్దాం…

ప్రజాయాత్రలు

రాష్ట్రమంతా సాగుతున్న ప్రజాయాత్రలు తటస్థ ఓటర్లను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి.వీటిలో ముఖ్యంగా వారాహి వాహనం పై పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ‘వారాహి విజయభేరి యాత్ర’ ప్రతిఒక్కరినీ… ముఖ్యంగా యువతని ఆలోచింపచేస్తుంది. వైసీపీ పార్టీ పాలనలో జరిగిన అన్యాయాలను పవన్ కళ్యాణ్ ఎండగట్టే తీరుకు అధికార పార్టీకి ముచ్చెమటలు పోస్తున్నాయి.

See also  AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రారంభించిన యాత్రలు నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఈ యాత్రలకు ప్రజలనుంచి.. ముఖ్యంగా ఆడపడుచుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

ఇంకా ప్రజాగళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు, అన్ స్టాపబుల్ పేరుతో నందమూరి బాలకృష్ణ, యువగళం పేరుతో నారా లోకేష్, ర్యాలీల పేరుతో దగ్గుపాటి పురందేశ్వరి, సాగిస్తున్న యాత్రలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వీరు చెప్పే విషయాలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు.

ఇవే కాకుండా మోడీ(Modi), చంద్రబాబు(Chandra Babu), పవన్ కళ్యాణ్ లు ఉమ్మడిగా నిర్వహిస్తున్న బహిరంగ సభలు… ప్రజలలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.

కూటమి ప్రచారం

సీట్ల సర్దుబాటుకు ముందు కూటమి ప్రచారం అంత బాగా జరగనప్పటికీ… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రచారం ఫుల్ జోష్ లో ఊపందుకుంది. ఎక్కడ చూసిన కూటమి జండాలే కనిపిస్తున్నాయి. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సామాన్య కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు కూటమి పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరూ తన పర భేదాలు మరిచి.. గెలుపే లక్ష్యంగా.. కలిసి మెలిసి ప్రచారం చేసుకుంటున్నారు.

See also  Nara family in Sankranti celebrations: నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో బాబు

Future of YCP మీద రాజధాని ఎఫెక్ట్

“నేను ముఖ్యమంత్రినైతే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తా”నని హామీ ఇచ్చి.. ఆ తరువాత మాడు రాజధానులంటూ ప్రజలను అయోమయం లోకి నెట్టి రాజధాని లేని రాష్త్రం గా ఆంధ్రప్రదేశ్ ని మార్చటం ఆంధ్రా ప్రజలను ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల లోని ప్రజలను తీవ్రంగా బాధించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను దొంగల లాగా, స్వార్థపరుల లాగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన విధానం మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. అమరావతిని రాజధానిగా నిలుపుకోవడానికి ఆ ప్రాంతపు ప్రజలు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం కావడంతో చివరి ప్రయత్నంగా ఓటుతో ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు.

Future of YCP మీద ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఉద్యమ ఎఫెక్ట్

జస్టిస్ మంజునాథన్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరిలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడం, కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని గతంలో జగ్గంపేట సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం, కాపు కార్పొరేషన్ కు నిధులు సమకూర్చక పోవడం, కాపులకు గత ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను రద్దు చేయడం వంటి విషయాలు కాపులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలని సీఎం జగన్ కుయుక్తి పన్నారు అని, కాపుల రిజర్వేషన్ ఉద్యమ సమయం లో జరిగిన తుని రైలు దహనం ఘటన సైతం వైసీపీ కనుసన్నల్లోనే జరిగిందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చెప్పిన మాటలను కాపులు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. దీని ప్రభావం ఓట్ల సరళి పై ఖచ్చితంగా పడబోతుందని కాపు ఉద్యమ నాయకులు నొక్కి చెబుతున్నారు. పైగా గతంలో జరిగిన అన్ని ఎన్నికలలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారం లోకి రావడం అన్నది ఒక ఆనవాయితీ గా కొనసాగుతుంది.

See also  Political Biopics: NTR బయోపిక్ ల నిరాదరణ, టీడీపీ ఓటమి.. యాత్ర 2 నిరాదరణ, వైసీపీ ఓటమిని సూచిస్తుందా?

వీటిని బట్టి వైసీపీ భవిష్యత్తు(Future of YCP) ఎలా ఉండబోతుందో.. ఊహించడం పెద్ద కష్టం కాదు.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top