World’s tallest Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడే- సీఎం జగన్

World's tallest Ambedkar statue: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Share the news
World’s tallest Ambedkar Statue: స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక విజయవాడే- సీఎం జగన్

Ambedkar Statue ఆవిష్కరణ

బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్(CM Jagan) మాట్లాడారు.

సంఘ సంస్కర్త, మరణం లేని మహనీయుడి విగ్రహం విజయవాడ(Vijayawada)లో ఆవిష్కృతమైందన్నారు. బాబా సాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బతికి ఉంటారని చెప్పారు. మన అడుగుల్లో ఆయన ఎప్పటికీ కనిపిస్తారని అన్నారు.

ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందని విన్నాం. ఇక స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ పేరు మారుమోగుతుంది” అని సీఎం జగన్ అన్నారు.

స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో 75వ రిప్లబిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు విగ్రహాన్ని(Ambedkar Statue) ఆవిష్కరిస్తున్నాం. పేదలు, మహిళలు, మానవ, ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి నిస్తుందన్నారు.

See also  Ambedkar Statue in Vijayawada: 19న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ!

అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయన విగ్రహం చూసినప్పుడల్లా మనకు కనిపిస్తూనే ఉంటారన్నారు.

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top