YCP MLC Vamsikrishna Yadav : పవన్ సమక్షంలో అనుచరులతో పాటు జనసేన లోకి వైసీపీ MLC వంశీకృష్ణ యాదవ్

Share the news
YCP MLC Vamsikrishna Yadav : పవన్ సమక్షంలో అనుచరులతో పాటు జనసేన లోకి వైసీపీ MLC వంశీకృష్ణ యాదవ్

YCP పార్టీకి చెందిన MLC వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార YCP కి వరుస షాక్‌లు తగులున్నాయి. ఈ రోజు తన వర్గానికి చెందిన కార్పొరేటర్లతో సహా ఆయన జనసేనాని పవన్‌ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సమక్షంలో జనసేన(Janasena) పార్టీలో చేరిపోయారు.

YCP MLC Vamsikrishna Yadav

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో చేరకముందే తాను పవన్ కల్యాణ్‌కు అభిమాని నని. పవన్ ఆలోచనలు నచ్చి ఈరోజు జనసేనలో చేరానన్నారు. ఇంకా వంశీకృష్ణ మాట్లాడుతూ “నేను నా సొంత పార్టీలోకి వచ్చాననే ఆనందం ఉంది. గతంలో ప్రజారాజ్యంలో నేను పని చేశాను. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్‌తో నాడు తిరిగాను. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నేటికీ ఉంది. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతాను. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడుతున్నాను. నాతో నడిచి వస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా చాలా మంది జనసేనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వారంతా అధికారికంగా పార్టీలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది చాలా మంది ఆకాంక్ష. ఆ కోరిక నెరవేరేలా అందరం కలిసి పని చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తాను. తప్పకుండా జనసేనకు అద్భుతమైన ప్రజాదరణను అందరూ చూస్తారు’’ అని వంశీ కృష్ణ పేర్కొన్నారు.

See also  TDP Janasena Seat Sharing: టీడీపీ-జనసేన సీట్ల పంపకం.. జనసేన 63 స్థానాల్లో! క్లారిటీ ఇచ్చిన టీడీపీ..

YCP MLC Vamsikrishna Yadav పై సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండడంతో.. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు.. వంశీని కలిసి చర్చలు జరిపారు. పార్టీ మారే ఆలోచన లేదని వంశీకృష్ణ తనకు చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.. దీనిపై మాత్రం వంశీ కృష్ణ స్పందించలేదు. కానీ, నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ అనుచరులతో సహా వెళ్లి Janasena పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో Janasena పార్టీలో చేరారు.

YCP MLC Vamsikrishna Yadav గురించి Pawan Kalyan

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ 2009 లో ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో పరిచయం ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.

See also  Supreme Court on CBN Quash Petition: బాబు క్వాష్ పిటీషన్ పై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ..!

YCP MLC Vamsikrishna Yadav గురించి Manohar

జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) మాట్లాడుతూ… సమాజానికి ఉపయోగపడే విధంగా కింది స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి వంశీకృష్ణ ఎదిగారన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. విశాఖలో వైసీపీ కోసం వంశీకృష్ణ అహర్నిశలు పని చేశారని.. ఏడు సార్లు నగర అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top