
YCP MP Balashauri met Pawan Kalyan
మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన(Janasena) పార్టీలో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే బాలశౌరి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు కూడా. తాజా భేటీ సుమారు రెండు గంటలపాటు సాగినట్లు తెలుస్తుంది. ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు బాలశౌరి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
MP Balashauri జనసేన పార్టీలో చేరితే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా లేదా గుంటూరు నుంచి పోటీచేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలశౌరి మాత్రం మరోసారి మచిలీపట్నం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కిన స్థానం నుంచి బాలశౌరిని పవన్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. పవన్, బాలశౌరి భేటీలో ఈ అంశంపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, బాలశౌరికి పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలశౌరి సీనియర్ నాయుకుడు కాబట్టి జనసేన పార్టీ లో ఆయనకు గౌరవప్రదమైన పదవి దక్కే ఛాన్సులు కూడా వున్నాయి
MP Balashauri రాజీనామా కి కారణం
స్థానిక వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ లతో చాలాకాలంగా MP Balashauri కి విబేధాలు వున్నాయి. ఈ విబేధాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ నేపథ్యంలో తనకు వైసీపీ అధిష్టానం సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. వైసీపీలో కొనసాగడం కష్టం అని భావించిన బాలశౌరి ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ తరువాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
సమావేశం అయిపోయిన తర్వాత బాలశౌరి మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. అన్ని విషయాలు తర్వాత చెబుతానన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.. జనసేనలో చేరికపై త్వరలో చెబుతానన్నారు. ఇక పవన్ ను కలిసిన వారిలో బాలశౌరి కుమారుడు కూడా ఉన్నారు.