Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక!

రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం. చాప కింద నీరులా ప్రచారం చేస్తున్న వైసిపి క్యాడర్. గెలుపే లక్ష్యంగా అడుగులు. ఇంకో పక్క విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక. ఆదమరిస్తే మాత్రం టిడిపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
Share the news
Repalle Constancy: రేపల్లె లో వైసిపి వ్యూహాత్మక ఎన్నికల ప్రచారం.. విజయం మనదేనంటూ టీడీపీ నత్త నడక!

Repalle Constancy లో వైసిపి Vs టీడీపీ

రేపల్లె: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు యుద్ధానికి సిద్ధమంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. టిడిపి(TDP) కంచుకోట రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్(Anagani Satya Prasad) కు ఎలాగైనా చెక్ పెట్టీ, టిడిపి కోటను బద్దలు కొట్టేందుకు వైసిపి(YCP) క్యాడర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని టిడిపిని ఓడించి రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో వైసీపీ జెండాను రెపరెపలాడించేందుకు తమ శాయ శక్తులు ఒడ్డుతూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. టిడిపి శ్రేణుల అంచనాలకు మించి వైసిపి క్యాడర్ ప్రణాళిక బద్ధంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఓటమిని చవి చూడాలని వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా పార్టీ క్యాడర్ చాప కింద నీరుల గ్రామాలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా పరిశీలకులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు(Mopidevi Ramana Rao) ను ప్రక్కన పెట్టి మధుసూదన్ రెడ్డిని రంగంలోకి దింపారు.

మోపిదేవికి సీటు లేదన్న కారణంతో రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) వైసీపీ క్యాడర్ చేసిన ఆందోళనలు దృష్టిలో ఉంచుకొని పార్టీ నష్ట నివారణ చర్యలను చేపట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుత వైసిపి అభ్యర్థి డాక్టర్ ఈవూర్ గణేష్ కు మోపిదేవి వర్గం సహకరించదనే స్పష్టమైన సంకేతాలు కనిపించడంతో అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల నుండి మోపిదేవిని ప్రక్కన పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

ఈవూరి గణేష్(Evuri Ganesh) గెలుపు లక్ష్యంగా వైసిపి పార్టీ శ్రేణులు మధుసూదన్ రెడ్డిని నియోజకవర్గ పరిశీలకులుగా ఎంపిక చేశారు. మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గంలో మోపిదేవి అనుచరుల సహకారంతో పాటూ, మరో నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో టీంను తయారు చేసి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

See also  Alapati: ఆలపాటి అసంతృప్తి!.. 7వ సారి టికెట్ రాలేదని, వరుసగా 6 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీని వీడతారట!

ఇప్పటికే పలుమార్లు ఎంపీ మోపిదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వైసిపి శ్రేణులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటినుండి నేటి వరకు పట్టణంలోని పలు వార్డుల్లోనూ గ్రామాలలోనూ ఎంపీ మోపిదేవి, డాక్టర్ ఈవూరి గణేష్ రహస్యంగా ఆయా ప్రాంత పెద్దలను కలిసి వైసిపికి ఓటు వేసే విధంగా వాగ్దానాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

నియోజకవర్గంలోని నగరం, చెరుకపల్లి, రేపల్లె నిజాంపట్నం, నాయకులు కార్యకర్తలు వివరాలు సేకరిస్తూ ప్రతి గ్రామంలోనూ, పట్టణ పరిధిలోని వార్డుల్లో గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఓటును వైసీపీ ఖాతాలోకి మరల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఒకటికి రెండుసార్లు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి రాబోయే రోజుల్లో మరింత సంక్షేమ అందిస్తామంటూ ప్రచారం చేస్తూ గ్రామ పెద్దలతో వాగ్దానం చేయించుకుంటున్నారు.

రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) పార్టీ పరిశీలకులుగా ఎంపికైన మధుసూదన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గ ముఖచిత్రాన్ని అవపోసన పట్టారు. నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్ లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, టిడిపి ఓటు బ్యాంకు ఎక్కడ అధికంగా ఉంది, వైసీపీకి ఎక్కడ ప్రతికూలంగా ఉంది తదితర సమాచారాన్ని సేకరించారు.

మండలంలో పోలింగ్ బూత్ ల స్థాయిలో 2014 ఎన్నికల ఫలితాలను 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలన చేసుకుంటు ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న టిడిపి ఓటు బ్యాంకును తమ ఖాతాల్లో వేసుకునేందుకు ఏ చిన్న అవకాశం ఉన్న వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పాత నాయకులను కలవడం, పార్టీలు మారిన వారిని కొత్త నాయకులను మోపిదేవి వర్గీలను సైతం కలుస్తూ వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వైసిపిని పటిష్టపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

See also  Janasainiks Fight over Poor Sanitation: పడకేసిన పారిశుధ్యంపై రేపల్లె జనసైనికుల పోరు

మరో ప్రక్క నివేదికలు సర్వే సంస్థల ఇచ్చిన రిపోర్టులు రివ్యూలు అన్ని టీడీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఊపందుకుంది. సర్వేల సారాంశాలతో టిడిపి గెలుపు పై ధీమా వ్యక్దే చేస్తూ ప్రచారాన్ని నత్త నడక లా సాగిస్తుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

చిన్న పామునైన పెద్దకర్రతో కొట్టాలనే సామెతను మరిచిన టిడిపి శ్రేణులు ఆర్భాటపు ప్రగల్బాలు తప్ప ఆచరణలో అంతంత మాత్రమే ప్రచారం చేస్తున్నారు. శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ ఒకలాగా, అతను లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ పరోక్షంగా పార్టీకి నష్టం కలిగిస్తున్నారు.

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు ముఖ్య అనుచర గణమంటూ చెప్పుకుంటున్న కొందరు టిడిపి నాయకులు గ్రూపులుగా ఏర్పడి సొంత నిర్ణయాలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోపక్క జనసేన(Janasena) పార్టీలో రెండు వర్గాలుగా ఆధిపత్యం నడుస్తూ ఉంది ఇందులో ఒక వర్గాన్ని ముఖ్య నేత అనుచరులు దగ్గరకు తీసి కష్టపడి పని చేసే వారిని దూరం పెడుతూ వారిపై తమదైన శైలిలో పెత్తనం చెలాయించే పనులకు శ్రీకారం చుట్టారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎవరికి వారు కిమ్మనకుండా మనకెందుకులే ఏం జరుగుతుందో చూద్దాం అనే సాచేత ధోరణితో వ్యవహరిస్తూ పార్టీని ప్రజల్లోనికి తీసుకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

See also  Pawan Speech in Yuvagalam: మార్చాల్సింది MLA లను కాదు.. జగన్ నే

ఇదిలా ఉండగా రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో వైసిపి అసమ్మతి వర్గం ఎక్కువగా ఉన్న టిడిపి శ్రేణులు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

టిడిపి పార్టీ శ్రేణుల్లో ఎక్కువమంది ఈసారి అనగానికి 30 వేల నుండి 40 వేల మెజార్టీ వస్తుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయటం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మేల్కొని తెలుగుదేశం పార్టీలో స్థానిక నాయకత్వంలో వివిధ పదవులు అనుభవిస్తున్న నాయకులు, అలంకార ప్రాయంగా కాకుండా పార్టీ పటిష్టతకు తీసుకోవలసిన చర్యలను వివరించాల్సిన అవసరం ఉందని ఆయా వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి ప్రత్యేక వ్యక్తిగత టార్గెట్లను ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు గెలుపు పై విశ్లేషిస్తున్నారు.

బూత్ లెవెల్ స్థాయిలో గత ఎన్నికల్లో ఎక్కడ పార్టీ వీక్ గా ఉందో పరిశీలన చేసుకొని అక్కడ ప్రత్యేక టీం లను రంగంలోనికి దింపి ప్రచారం నిర్వహించాలని చెబుతున్నారు. మరోపక్క కుల సంఘాల నాయకులకు తోడు వాక్చాతుర్యం, సమర్థత కలిగిన నాయకులను ఆయా గ్రామాలకు పంపించి ఓటు యొక్క ఆవశ్యకత ప్రభుత్వ పనితీరును చర్చించాల్సిన అవసరం ఉంది.

నాయకులను నమ్ముకుని కార్యకర్తలు చెబుతున్న గారడీ మాటలు విని, గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తే టిడిపి రేపల్లె నియోజకవర్గం(Repalle Constancy) లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు….

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top