Donkey Milk: సరిగా చదువుకోపోతే గాడిదలు కాచుకోవచ్చు.. నెలకు 2-3 లక్షలు సంపాదించు కోవచ్చు!

Share the news
Donkey Milk: సరిగా చదువుకోపోతే గాడిదలు కాచుకోవచ్చు.. నెలకు 2-3 లక్షలు సంపాదించు కోవచ్చు!

Donkey Milk తో నెలకు 2-3 లక్షలు సంపాదన!

బాగా చదువుకోకపోతే గాడిదలు కాయల్సి వస్తుంది అంటూ పెద్దవాళ్లు పిల్లల్ని మందలిస్తుంటారు. అలాంటివారు గుజరాత్(Gujarat) కు చెందిన ధీరన్ సోలంకి(Dhiren Solanki) స్టోరీ వింటే మాత్రం అభిప్రాయం మార్చుకుంటారు ఎందుకంటే గాడిదలు పెంపకంతో అతడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు మరి. అతను చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసాడు ఫలితం లేక కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేశాడు ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఆ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు కోసం అన్వేషించాడు. దాంతో అతనికి దక్షిణ భారత్ లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతుందని తెలుసుకున్నాడు. దాంతో పాటు కొంతమందిని కలిసి మరింత సమాచారం కూడా సేకరించాడు.

ఇక ఎనిమిది నెల క్రితం అతను 20 గాడిదలతో సొంత ఊర్లోనే ఫామ్(Donkey Farm) ప్రారంభించాడు. 22 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు 20 గాడిదలు 42 గాడిదలు అయ్యాయి. గాడిద పాలను(Donkey Milk) దక్షిణ భారత్లోని కష్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. నెలకు దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు లక్షలు సంభవిస్తున్నాడు. గుజరాత్ లో గాడిద పాల(Donkey Milk)కు పెద్దగా గిరాకీ లేదు దానితో మొదట్లో కాస్త కష్టం అనిపించింది. దీంతో తొలి అయిదు నెలలు ఆదాయము ఏమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారతలోని కస్టమర్లను సంప్రదించాడు. అక్కడ డిమాండ్ బాగా ఉండటంతో కర్ణాటక, కేరళ కు గాడిద పాలను(Donkey Milk) సరఫరా చేస్తున్నాడు. ఈ పాలను ముఖ్యంగా సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయట.

See also  Bharat Ratna LK Advani: భారతరత్న అందుకోనున్న ఎల్‌కె అద్వానీ జీవిత విశేషాలు ఓ సారి చూసేద్దామా!

ఇక ఈ గాడిద పాలు ఒక లీటర్ ధర 5000 నుంచి 7000 వరకు ఉన్నట్లు సోలంకి చెప్పాడు తాజాగా ఉండటం కోసం పాలను ఫ్రీజర్ల లో నిలువ చేస్తున్నాడు. వీటిని పాలపొడిగాను మార్చి విక్రయిస్తున్నాడు. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని సరఫరా చేస్తున్నాడు. ఇప్పటి వరకు 38 లక్షల వరకు ఖర్చు అయింది అట. ఎలాంటి ప్రభుత్వ సహకారం తీసుకోకుండానే ఈ బిజినెస్ చేస్తున్నాడు. ప్రభుత్వం ఈ రంగంపై దృష్టి సారిస్తే ఇంకా బాగుంటుందని తను సూచించాడు.

ఇక ఈ గాడిద పాలను ఇన్ఫెక్షన్లు, కోరింత దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమాకి ఔషదంగా వాడుతున్నారు. ఈ పాలల్లో A, B, B1, B12, C, D, E విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు తక్కువ. నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు దురద, తామర వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధం అని చెబుతున్నారు. ఈ పాలతో ఫెయిర్నెస్ క్రీమ్, షాంపూ, లిప్ బాం, బాడీ వాష్ వంటి కాస్మోటిక్ తయారు చేస్తారట

See also  Congress Bank Accounts Freeze Case: కాంగ్రెస్ ఖాతాలు ఎందుకు IT డిపార్ట్‌మెంట్ స్కానర్‌లో ఉన్నాయి..???

కొసమెరుపు: రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ఉచితాలకు అలవాటు చేయకుండా, ఇలాంటి యూనిట్లు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తే ఉపాధికి ఉపాధి మరియు రాష్ట్రాలు ఆర్ధికంగా కూడా బాగుపడతాయి. ఇక యువత కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల మీదే కాకుండా ఇలాంటి స్వయం ఉపాధి పధకాల మీద ఆధారపడితే భష్యత్తులో మంచి వ్యాపారవేత్తలగా తయారు అవ్వవచ్చు, తామే పదిమందికి ఉపాధి కల్పించ వచ్చు కూడా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top