
IT slowdown, భయం భయంగా IT ఉద్యోగులు!
గత ఆర్ధిక సంవత్సరంలో టాప్ ఫైవ్ IT కంపెనీల్లో 69 వేల మంది తగ్గింపు. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య నానాటికి తగ్గుతుంది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పెరగడం చూసాం కానీ తగ్గడం చూడలేదు. ఒక HCL మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీలో ఉద్యోగుల తగ్గుదల కనిపిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టాప్ ఫైవ్ ఐటీ కంపెనీల్లో ఏకంగా 69 వేల మేరకు ఉద్యోగుల సంఖ్య తగ్గింది
ఇటీవల ఆయా కంపెనీలు వెలువరించిన త్రైమాసిక ఫలితాలు సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడం కారణంగా కనిపిస్తుంది, టిసిఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro), HCL టెక్నాలజీ స్, టెక్ మహీంద్రా(Tech Mahindra) ఇటీవల త్రైమాసిక ఫలితాలతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా ప్రకటించాయి. ఈ గణాంకాలను గమనిస్తే మొత్తం 69,167 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితి ఐటీ ఉద్యోగులను కలవరపెడుతుంది.
ఇకపోతే బిటెక్ విద్యార్థుల ట్రెండ్ చూస్తుంటే, పొలో మని అందరూ Btech కంప్యూటర్ సైన్స్ లోనే చేరుతున్నారు. రానున్న సంవత్సరాలలో లక్షల్లో రానున్న బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సరిపోను ప్లేస్మెంట్స్ లేకపోతే వాళ్ల పరిస్థితి ఏమిటి? AI వల్ల Information Technology రంగంలో డిమాండ్ మరింత తగ్గడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని వేలం వెర్రిలా అందరూ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే రంగాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులు నేర్చుకుంటే మంచిది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ , మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలా చాలా రంగాల్లో ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని చేరితే మంచిది.