Akhil New Movie: మరోసారి హై బడ్జెట్(80 కోట్ల) సినిమాతో తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుంటున్న అఖిల్..

Share the news
Akhil New Movie:  మరోసారి హై బడ్జెట్(80 కోట్ల) సినిమాతో తన కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుంటున్న అఖిల్..

అందం, నటన, బాడీ ఇలా అన్నీ ఉన్నా అక్కినేని అఖిల్‌కి ఇప్పటివరకూ సరైన హిట్ మాత్రం రాలేదు. హలో కొంచం పరవాలేదు అనిపించినా కూడా మిగితా సినిమాల విషయంలో రిజల్ట్ మాత్రం ఒకేలా ఉంది. ఎంతో కష్టపడి మూడేళ్ల పాటు ఏజెంట్ సినిమా కోసం పని చేసినా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బోల్తా కొట్టింది.

ప్రస్తుతం అఖిల్(Akhil) కాస్త గ్యాప్ తీసుకొని కొంచం చిల్ అవుతున్నాడు. అయితే రీసెంట్ గా సాలార్ సక్సెస్ వీడియోలో అఖిల్ కనిపించడంతో సాలార్ 2 లో అఖిల్ ఉంటాడేమో అని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అలాగే కొంతమంది “అసలు ఖాన్సార్ ప్రాంతంలో ఎం జరుగుతుందో తెలుసుకోమని ప్రభాస్ అఖిల్ ని ఏజెంట్ రూపంలో పంపిస్తాడు” అని ట్రోల్స్ కూడా చేసారు.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సినిమా ఫ్లాప్ అవడానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డే కారణమంటూ దారుణంగా ట్రోల్ చేశారు. సినిమాలో చాలా సీన్స్ ఇల్లాజికల్ గా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఇక వైల్డ్ అనే డైలాగ్ పై కూడా చాలా ట్రోల్స్ జరిగాయి. కానీ గతంలో సురేందర్ రెడ్డి తీసిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కిక్, రేసుగుర్రం, ధృవ వంటి సినిమాలు కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో తీసిన సైరా నరసింహారెడ్డి కూడా పరవాలేదనిపించింది కానీ అఖిల్‌తో బాగా టైం తీసుకొని చేసిన కష్టపడి తీసిన ‘ఏజెంట్’ మాత్రం ఇలా అట్టర్ ఫ్లాప్ అయింది.

See also  Sankranti Movies 2024: సంక్రాంతి బాద్ షా ఎవరు?

Akhil New Movie

అయితే ఏజెంట్ సినిమా చేసేటప్పుడు అఖిల్(Akhil) ఒక సినిమాని అనౌన్స్ చేసాడు ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వల్సింది అని కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని. అయితే అఖిల్- అనిల్ కుమార్ కలిసి ఈ కథ ఫైనల్ డ్రాఫ్ట్ కోసం కష్టపడుతున్నారని. ఈ మూవీ డైలాగ్ వర్క్ జరుగుతుందని తెలిసింది.

ఈ మార్చిలో సినిమాను అధికారికంగా లాంఛ్ చేసి సెట్స్ పైకి వెళ్లాలని అఖిల్(Akhil) అనుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా కోసం రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. అఖిల్‌ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అనుకుంటున్నారు అంతా ఆశిస్తున్నారు. దీంతో స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కా అయిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనే ప్లాన్స్ లో ఉన్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి క్యాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేస్తున్నారని తెలుస్తుంది.

See also  Vishwambhara Mud Fight Sequence: విశ్వంభర లోని అద్భుతమైన మట్టి ఫైట్ సీక్వెన్స్ లో చిరంజీవి ఫైట్!

కొసమెరుపు: గత సినిమాల కలెక్షన్స్ చూస్తే అఖిల్ మూవీస్ 30 నుంచి 40 కోట్ల గ్రాస్ వసూలు చేయ గలవు. అంటే 15 నుంచి 20 కోట్ల షేర్ అన్నమాట. అది కూడా మూవీ పరవాలేదు అనే టాక్ వస్తేనే. ఇక ప్లాప్ అయితే 10 to 12 కోట్లు గ్రాస్ మాత్రమే. ఇన్ని అనుభవాలు వున్నా కూడా మరలా హై బడ్జెట్ అంటూ ఎందుకు రిస్క్ చేస్తున్నాడో?

-By Pranav @ samacharnow.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top