
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అల్లు అర్హకి(Allu Arha) సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందొ మనందరికీ తెలిసిందే…. తండ్రి బన్నీతో కలిసి అర్హ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ ని బే అని పిలవడం, అయాన్ ని ఇబ్బంది పెట్టడం, దోసా స్టెప్ బాగుంది అనడం లాంటి వీడియోస్ లాక్ డౌన్ టైం లో తెగ వైరల్ అయ్యాయి.
ఇక రీసెంట్ గా అయాన్ కి సంబంధించి కూడా రెండు వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఎదో ఫంక్షన్ లో హీరొయిన్ పూజా హెగ్డే ఎంత పిలుస్తున్నా పట్టించుకోకపోవడం అలాగే ఎవరో ఒక అమ్మాయి సేల్ఫీ కోసం వస్తే నేను ఇవ్వను వెళ్ళిపో అనడం బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా లో తనకి మోడల్ అయాన్ అని కూడా పేరుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ అయాన్ ఎలా ఉన్నాడు అని అడిగితే “మోడల్ బోల్తే” అంటూ నవ్వాడు.
ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా మరో వీడియోతో వచ్చేసింది అల్లు అర్హ(Allu Arha). సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలోని ‘జమల్ కుదు’ పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. బాబీ డియోల్ ఎంట్రీ సీన్‌లో వచ్చే ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూ ట్యూబ్ లో ఓ ఊపు ఊపేసింది. ఎక్కడ చూసినా ఈ సాంగ్‌తోనే తెగ రీల్స్, షార్ట్స్ చేశారు. తాజాగా ఈ పాటకి అల్లు అర్హ స్టెప్పులేసింది.
ఈ సాంగ్‌లో మందు గ్లాస్ తలపై పెట్టుకుని బాబీ డియోల్ డాన్స్ చేస్తాడు. అయితే అదే పాటకు అర్హ కూడా డ్యాన్స్ చేసింది. కానీ తలపై గ్లాస్‌తో కాకుండా ప్లేట్ పెట్టుకుని స్టెప్పులేసిన వీడియో నేట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అర్హ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటికే అర్హ వెండితెరకి పరిచయం అయింది. సమంత నటించిన శాకుంతలం సినిమాతో అర్హ అరంగేంట్రం చేసింది.
Allu Arha Viral Video
Arha😂😂❤ pic.twitter.com/ywwSnzTtuw
— AK. (@flawsomedamsel) February 21, 2024
-By Pranav @ samacharnow.in