Anupama Parameswaran: అసలు మీరు సినిమాని చూసారా అంటూ గుల్టెకి గట్టిగా ఇచ్చిన అనుపమ..

Share the news
Anupama Parameswaran: అసలు మీరు సినిమాని చూసారా అంటూ గుల్టెకి గట్టిగా ఇచ్చిన అనుపమ..

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) మళయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయమై అటు తమిళ, కన్నడ, మళయాళ ఆడియన్స్ కే కాకుండా తెలుగులో కూడా అ ఆ, శతమానంభవతి లాంటి ఫ్యామిలీ సినిమాలతో దగ్గరైంది… అయితే అనుపమ రీసెంట్ గా తెలుగులో ఈగల్ సినిమాతో వచ్చింది కానీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదన్న విషయం మనందరికీ తెలుసు.

గుల్టె వెబ్ సైట్ రివ్యూ పై మండిపడిన Anupama Parameswaran

ఇప్పుడు తమిళంలో సైరెన్(Siren) మూవీతో అదరగొట్టేస్తోంది. నెక్ట్స్ మళ్లీ టిల్లు స్క్వేర్ అంటూ రాబోతోంది. అయితే సైరెన్ మూవీపై ఓ వెబ్ సైట్ ఇచ్చిన రివ్యూ మీద అనుపమ తన ఇంస్టాగ్రామ్ లో మండిపడింది. ఓ చెవిటి, మూగ అమ్మాయి పాత్రకు డైలాగ్స్ కూడా ఉంటాయా? అని కౌంటర్లు వేసింది. ఆ చాట్‌ను కూడా తన ఇంస్టా స్టోరీలో పెట్టేసుకుంది అనుపమ. ఇలా బేస్ లెస్ వార్తలు రాస్తారని తెలియాలిగా.. అందుకే పెడుతున్నా అని చెప్పి మరీ స్టొరీ యాడ్ చేసింది.

See also  Jai Hanuman: బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ వీరంగం..4 రోజుల్లో 100 కోట్లు.. 10 రోజుల్లో 200 కోట్లు..

అసలేం జరిగిందంటే.. ఓ ప్రముఖ వెబ్ సైట్ సైరెన్ మూవీ రివ్యూ రాసింది. అందులో అనుపమ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఆమె ఇటీవలే రెండు చిత్రాల్లో కనిపించింది. ఇక అందులో ఈగల్ ఒకటి. ఈగల్ చిత్రంలో సైడ్ రోల్ చేసింది. ఆమెకు దాని వల్ల ఎటువంటి ప్రయోజనం రాలేదు. తరువాతి చిత్రం సైరెన్. ఇందులో జయం రవి హీరో.. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. అనుపమ కొన్ని సీన్లకు పరిమతం అయింది. అసలు డైలాగ్స్ అన్నవి కూడా లేవు అని చెప్పుకొచ్చారు.

అయితే తను ఆ వెబ్సైటు తో మాట్లాడుతూ మూగ, చెవిటి అమ్మాయి కూడా డైలాగ్స్ మాట్లాడాలి అని రాసారు మీరసలు సినిమా చూసారా అంటూ ప్రశ్నించించి… గ్రేట్ అంటూ కౌంటర్లు వేసింది. అంటే సైరెన్ సినిమాలో అనుపమది డెఫ్ అండ్ డంబ్ కారెక్టర్. అయినా ఆ పాత్రకు ఒక్క డైలాగ్ కూడా లేదని రాయడంతో అనుపమ ఇలా మండి పడింది. దీంతో సదరు వెబ్ సైట్ టీం స్పందించింది. ఎడిట్ చేయిస్తామని చెప్పుకొచ్చింది.

See also  Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం!

ఇది నేను ఇంస్టా(Insta) స్టోరీలో పెడతాను.. ఎందుకంటే ఎలాంటి ఆర్టికల్స్ రాస్తున్నారు.. ఎలాంటి నిరాధారమైన ఆర్టికల్స్ రాస్తున్నారో జనాలకు తెలియాలి కదా? అని చెబుతూ ఇలా తన ఇంస్టా స్టోరీలో పెట్టేసింది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)

-By Pranav @ samacharnow.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top