Chiranjeevi as MP again: చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్….??

Chiranjeevi as MP again: మెగా స్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్....??త్వరలోనే రాజ్యసభకు పంపుతారని కొత్తగా స్ప్రెడ్ అవుతున్న న్యూస్..
Share the news
Chiranjeevi as MP again: చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్….??

Chiranjeevi మరల MP గా..?

ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి(Chiranjeevi) మొన్ననే దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను పొందిన సంగతి తెలిసిందే. ఇద్దరు తెలుగు లెజెండ్స్(చిరంజీవి & వెంకయ్య) కి ఒకేసారి పద్మవిభూషణ్ రావడం తెలుగు వారి ఆనందానికి అవధులు లేవు. మెగా కాంపౌండ్ మరియు మెగా ఫాన్స్ ఆ సంతోషంలో ఉండాగానే ఇప్పుడు ఇంకో న్యూస్ (ఇంకా కంఫర్మ్ కాలేదు) బయటకు వచ్చింది. అది ఏమిటంటే మోడీ సర్కార్.. త్వరలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని.ఈ న్యూస్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిందా లేదా వేరే సోర్స్ నుంచా అనేది తెలియవలసివుంది..

దీనిలో నిజమెంతో కానీ బీజేపీ మాత్రం చిరంజీవి(Chiranjeevi) ని తమ వైపుకు తిప్పుకోవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఏపీ లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో మోడీ తో కలసి పాల్గొనడం కానీ, అప్పడప్పుడు బీజేపీ ప్రముఖులు చిరంజీవి కలవడం మనం చూస్తూనే వున్నాం. ఎంతో కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోపట్టు కోసం చూస్తున్న బీజేపీ, చిరంజీవి లాంటి వారు తమ పార్టీలో ఉంటే వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది.

See also  Modi with Chiranjeevi and Pawan Kalyan: ప్రమాణస్వీకార సభలో ఇంట్రెస్టింగ్ సీన్!

ఇక చిరంజీవి సైడ్ నుంచి చూస్తే, రాజకీయాలు తన ఒంటికి పడవని విరమించుకొని మరలా సినిమాలు చేస్తున్న చిరంజీవి ఈ ఆఫర్ని ఒప్పుకోక పోవచ్చు. ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నత మైన స్థానంలో ఉన్నారు. ఇండస్ట్రీలో అందరికి తలలో నాలుకలా ఉంటూ, problems కి సొల్యూషన్ అవుతూ, ఇండస్ట్రీ పెద్దగా పిలుచుకోబడుతున్న ఆయన మరలా రాజకీయాల వైపు వెళ్ళక పోవచ్చు. ఒకవేళ వెళితే మాత్రం, తెలుగు రాజకీయ ఈక్వేషన్స్ లో మార్పులు రావడం ఖాయం. చూద్దాం ఏం జరగనుందో..

Also Read News

Scroll to Top