Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు

Chiranjeevi into Vishwambhara: భగ భగ మండుతున్న అగ్ని గుండం మ‌ధ్య చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించి, చిరంజీవి విశ్వంభర సెట్ లోకి అడుగు పెట్టారని చెప్పిన చిత్ర యూనిట్.
Share the news
Chiranjeevi into Vishwambhara sets: “విశ్వంభర”లో ఎపిక్ జర్నీ ప్రారంభించిన చిరు

Chiranjeevi into Vishwambhara sets

చిరంజీవి 156వ చిత్రం ‘విశ్వంభ‌ర` షూటింగ్ లోకి ఎంటర్(Chiranjeevi into Vishwambhara) అయ్యారు. దానికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. “మెగాస్టార్ విశ్వంభర యొక్క శక్తివంతమైన ప్రపంచంలోకి తన అడుగు పెట్టారు” అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు

దీంతో నేటి నుంచి చిరంజీవి సెట్స్ కి హాజ‌రు కానున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో కొన్ని భారీ సెట్లు సిద్దం చేసి పెట్టారు. కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఏకంగా 13 ర‌కాల సెట్లు సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో మేజ‌ర్ పార్ట్ షూటింగ్ అంతా అక్క‌డే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

బ‌య‌ట లొకేష‌న్లో షూటింగ్ ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక చిరంజీవి ఎంట్రీ కంటే ముందే ఆయన లేని స‌న్నివేశాల‌ని మారుడుమిల్లి అట‌వీ ప్రాంతంలో తొలి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి పాత్ర‌కి జోడీగా ఇద్ద‌రు నాయిక‌లు ఉంటార‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ‘బింబిసార` ఫేం మ‌ల్లిడి వశిష్ట (Vasishta) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు.

See also  Megastar Chiranjeevi at HanumaN Pre Release Utsav: "హను మాన్" టైటిల్ చిరంజీవి సూచించారా ?

Also Read News

Scroll to Top