బింబిసార సినిమాతో మేకింగ్ మీద తనదైన ముద్ర వేసిన వశిష్ట దర్శకత్వం లో, చిరంజీవి చాలా కాలం తరువాత మళ్లీ ఒక సోషియో ఫాంటసీ సినిమాలో నటించ బోతున్న సంగతి తెలిసిందే. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తరువాత మళ్లీ ఆ జానర్‌ను టచ్ చేయబోతోన్నాడు. ఇక చిరంజీవి, వశిష్ట కాంబో లో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
Movie Title and Concept Video
ఈ మూవీ పేరు మీద రకరకాలుగా చర్చలు జరిగాయి. విశ్వంభర(Vishwambhara) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా రూమర్లు కూడా వచ్చాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. దాంతో పాటు కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు.
Vishwambhara movie Concept వీడియో మొదట్లో చూపించిన ఆ ప్లేస్ ఏంటి? అక్కడ ఉన్న ఆ బాక్స్ ఏంటి? ఆ బాక్స్ లో ఉన్నది ఏంటి? ఆ తరువాత వచ్చిన కాలచక్రం లాంటి షాట్ దేనికి సింబాలిక్.. తరువాత భూమ్మిదకు వచ్చిన ఆ శకలాలు ఏంటి? వాటితో పాటుగా వచ్చిన ఆ బాక్స్ .. ఉల్కా పాతంలా పడటం.. ఆ టైంలో హనుమాన్ భారీ హన్మంతుడి విగ్రహాన్ని చూపించడం.. భూమ్మీద పడ్డ ఆ పెట్టెలోంచి ఏం వచ్చింది.. వీటన్నిటిని అద్భుతమైన విజువల్స్ లో చూపెట్టడం.. నిజంగా విజువల్ వండర్ అంటున్నారు. తప్పకుండా ఇది టాలీవుడ్ నుంచి వస్తున్న మరో హాలీవుడ్ స్థాయి సినిమా అవుతుంది అంటున్నారు . వచ్చే సంక్రాంతికి ఈ మూవీ బరిలోకి దిగబోతోంది అని టాక్. ఇక ఆ వశిష్టుడి అద్భుత సృష్టి ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఎదురుచూడాల్సిందే అన్నమాట.
Vishwambhara Movie Concept Video
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope – 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫#Mega156 is #Vishwambhara ❤️🔥
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024
Title and concept video out now!
– https://t.co/hm9wO9nyaw
In cinemas Sankranthi 2025.@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota… pic.twitter.com/fOyCDIMV3M