ఈ మధ్య ఎక్కువగా సూపర్ హీరో అనే కాన్సెప్ట్ తోనే సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి కి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. దాంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కల్కి సినిమాతో మే 9న మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే… అయితే సంక్రాంతి సందర్భంగా అనౌన్స్ చేసిన విశ్వంభర కూడా ఈ కేటగిరీ కి చెందినదే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరొయిన్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి(Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ తీసిన ఈ చిత్రం మంచి అంచనాలతో వచ్చినప్పటికీ చిరు ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచింది. కీర్తి సురేశ్ ఇందులో చిరు చెల్లెలిగా నటించగా తమన్నా హీరొయిన్ గా చేసింది. మంచి క్యాస్టింగ్ ఉన్నా కూడా స్టోరీ బలంగా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయింది కనుక విశ్వంభర సినిమాతో(Vishwambhara Movie) భారీ హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దాంతో పాటు మెగాస్టార్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
Vishwambhara Movie Update
బింబిసార డైరెక్టర్ వశిష్ట(Vasishta) తెరకెక్కిస్తోన్న Vishwambhara Movie 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రకీరణ కూడా పూర్తయింది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష జాయిన్ అయిన సంగతి తెలిసిందే. జెంటిల్‌మన్, బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సురభి ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిసింది. సురభి తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినందువల్ల అంతగా గుర్తింపు రాలేదు. అయితే సినిమాలో ఆమె పాత్ర గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
అయితే ఈ న్యూస్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హర్షవర్ధన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌లు కూడా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రివీల్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే చాలా ఇంటర్వ్యూల్లో సినిమాపై డైరెక్టర్ వశిష్ట చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. చిరంజీవి కెరీర్‌లో టాప్ 3 సినిమాల్లో ఇది తప్పకుండా చోటు దక్కించుకుంటుందని కామెంట్స్ చేశాడు. అలానే ప్రేక్షకులను థ్రిల్ చేసే సరికొత్త ప్రపంచాన్ని విశ్వంభర కోసం సృష్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విశ్వంభర సినిమాకి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకి చాలా దగ్గర పోలీకలు ఉంటాయని తెలుస్తుంది.
ఇలా రిలీజ్‌కి ముందే విశ్వంభర గట్టిగా బజ్ క్రియేట్ చేస్తుంది.
-By Pranav @ samacharnow.in