Classic Director Bapu 90వ జయంతి సందర్భంగా

Classic Director Bapu అనగానే గుర్తుకొచ్చేది అందమైన బాపు బొమ్మలు. ఆయన దస్తూరి, కార్టూన్లు, ఆయన తీసిన సంపూర్ణ రామాయణం ముత్యాలముగ్గు, మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాలు
Share the news
Classic Director Bapu 90వ జయంతి సందర్భంగా

Classic Director Bapu: Achievements

డిసెంబర్ 15,1933లో గోదావరి జిల్లా నర్సాపురం లో జన్మించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. వృత్తిపరంగా బాపు అని పిలుస్తారు. ఆయన ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు. ఆయన తెలుగు సినిమా మరియు హిందీ సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు.ఆయన భారతీయ కళ మరియు సినిమాకి చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన రెండు జాతీయ గౌరవాలు, రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఏడు రాష్ట్ర నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, రఘుపతి వెంకయ్య అవార్డు మరియు ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – సౌత్‌ ను పొందారు. అలాగే బాపు రమణల గొప్ప స్నేహం. దర్శకుడు, రచయితల వేవ్ లెంగ్త్ కలిస్తే దృశ్యాలు తెరమీద ఎంతబాగా వస్తాయో కూడా బాపు చిత్రాల్లో మనం చూడొచ్చు.

See also  Anant Ambani pre wedding ceremony: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మెరిసిన రామ్ చరణ్, ఉపాసన!

Classic Director Bapu గురించి ఆరుద్ర

“కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండెలూయలలూపు
ఓ కూనలమ్మ” అన్న ఆరుద్ర మాటలు మర్చిపోగలమా

Classic Director Bapu డైరెక్ట్ చేసిన కొన్నిచిత్రాలు

బాపు డైరెక్ట్ చేసిన తెలుగు చిత్రాలు సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, సీతా కళ్యాణం తెలుగు సినిమా మైలురాళ్లు కాగా, త్యాగయ్య, భక్త కన్నప్ప, శ్రీనాథ కవిసార్వభౌమ వంటి చారిత్రక చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
బాపు-రమణ కాంబినేషన్‌లో రాధా కళ్యాణం, వెలుగు నీడలు, భార్యాభర్తలు, భోగిమంత, ముత్యాల ముగ్గు, సాక్షి, మిస్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం వంటి చిత్రాలతో పెద్ద తెరపై మ్యాజిక్‌ను సృష్టించారు. వీరిద్దరు మన వూరి పాండవులు (1978)కి దర్శకత్వం వహించారు
Bapu డైరెక్ట్ చేసిన కొన్ని హిందీ చిత్రాలు Hum Paanch, Bezubaan, Woh Saat Din, Mohabbat, Pyari Behna, Mera Dharam, Diljalaa, Prem Pratigyaa and Paramaatma.

Classic Director Bapu గురించి మరికొన్ని

బాపు గురించి మరి కొన్ని విషయాలు సి.యస్.రాంబాబు గారు చేసిన వీడియో లో చూడండి. సి.యస్.రాంబాబు ఆకాశవాణి లో మూడు దశాబ్దాలు పైగా పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. సాహిత్యమంటే ఎంతో ఇష్టం. యాభైకి పైగా కథలు రచించారు. పసిడి మనసులు శీర్షికతో కథల సంపుటి వెలువరించారు. అదే పేరుతో వారి మిత్రులు ఓ కవిత్వ సంపుటి ప్రచురించారు. అనేకమంది సాహితీవేత్తలతో పరిచయాలు అటు ఆకాశవాణి లోను, వివిధ పత్రికల్లోనూ నిర్వహించారు. ప్రస్తుతం
Radio Rambabu పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆయన వీడియో ల కోసం Click here

See also  HanumaN Box Office Records: నాలుగు అంగల్లో 100 కోట్ల మార్క్ ను దాటిన హనుమాన్!

Also Read News

Tags

Scroll to Top