CM Revanth greets Padma Vibhushan Chiranjeevi
పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి(Padma Vibhushan Chiranjeevi) అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అని, ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!
ఇక ఈ విందులో చిరంజీవి సతీమణి సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, ఉపాసన వాళ్ళ తల్లి శోభన & తండ్రి అనిల్, ఇంకా దిల్ రాజు కూడా ఉన్నారు
-By C. Rambabu